ఆర్ఆర్ఆర్: ౩౦౦ కోట్ల ఆఫర్.. అంతలో రాజమౌళికి షాక్ ??

Only three songs in the film?, ఆర్ఆర్ఆర్: ౩౦౦ కోట్ల ఆఫర్.. అంతలో రాజమౌళికి షాక్ ??

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలను జక్కన్న విపరీతంగా పెంచేశాడు. ఇది ఇలా ఉండగా రాజమౌళి తన సినిమాలను ఎంత భారీగా తీస్తాడో.. అలాగే పాటలు కూడా విజువల్ వండర్స్‌గా నిలుస్తాయి. కథ, హీరోల క్యారెక్టర్లపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా. లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో మాత్రం మూడే పాటలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌తో ఓ డ్యూయెట్.. చరణ్‌తో ఓ డ్యూయెట్.. ఇక మూడో పాటను ఎన్టీఆర్- చరణ్ ఇద్దరికీ కలిపి ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు మరో సాంగ్ ఉన్నా.. అది మాంటేజ్ సాంగ్ అట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ‘బాహుబలి’ సినిమా మాదిరిగా కాకుండా ఈ చిత్రం తక్కువ రన్‌టైం కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది కాబట్టి అన్ని భాషల్లోని ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా పాటల్ని కుదించారట.

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం రాజమౌళి ఆశ్రయించిన సంస్థలు అయన ఆఫర్ చేసిన రేట్ విని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం. శాటిలైట్, డిజిటల్ మీడియా హక్కులు కలిపి ఏకంగా 300 కోట్లు డిమాండ్ చేశారని విశ్వసనీయ సమాచారం. ఇంత డిమాండ్ ఉన్న ఈ సినిమా లోని పాటలు, క్లిప్పింగ్స్ ఇలా లీక్ అవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *