‘ఆర్ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్ రీల్‌ పెదనాన్న..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న

'ఆర్ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్ రీల్‌ పెదనాన్న..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 2:48 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని పలు భారతీయ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో క్రేజ్ తీసుకురావడం కోసం ఇప్పటికే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, అలియా భట్‌లతో ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు జక్కన్న. ఇక మిగిలిన భాషల్లోనూ క్రేజ్ తీసుకురావడం కోసం రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో కోలీవుడ్, మాలీవుడ్ నుంచి స్టార్ నటులను ఇందులో కెమెరా అప్పియరెన్స్‌ ఇప్పించాలని ఆయన భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి విజయ్‌ పేరు వినిపించింది. ప్రస్తుతం ఆయనతో రాజమౌళి టీమ్ సంప్రదింపులు జరుపుతోందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ ఎన్టీఆర్ పెద నాన్నగా కనిపించిన విషయం తెలిసిందే. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు అతిథి పాత్రలలో కనిపించనున్నారు..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!