Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 38 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 138845. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 77103. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 57721. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4021. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం. రేపు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.
  • టీవీ9 తో సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. మరో 30 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ఐదు నుంచి పది రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం . ఎండాకాలం ఉష్ణోగ్రతలు పెరిగినంత మాత్రాన వైరస్ వ్యాప్తి ఆగదు. ప్రకటిస్తున్న వాక్సిన్ లు అన్నీ ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి కనీసం ఆరు నెలలకు పైగా సమయం పడుతుంది. కరోనా వైరస్ మ్యుటేషన్ నేపథ్యంలో వాక్సిన్ పనితీరు పై కూడా ప్రభావం ఉంటుంది .
  • వరంగల్: తొమ్మిది మందిని హత్య చేసిన హంతకుడు ఒక్కడే.. సంజయ్ కుమార్ యాదవ్. నిషా సోదరి రఫీకా హత్యను కప్పిపూడ్చుకోవడం కోసం ఈ తొమ్మిది హత్యలు చేశాడు. సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితున్ని గుర్తించాము. 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్డకొడుకు జన్మదిన వేడుకలరోజు తన మర్డర్ స్కెచ్ కు వేదికగా మార్చుకున్నాడు. వారు తినే అన్నంలో నిద్రమాత్రలు పొడిచేసి కలిపాడు... వారంతా మత్తులోకి జారుకున్న తర్వాత గోనెసంచిలో ఈడ్చుకెళ్ళి బావిలో పడేశాడు. ఈ హత్యలన్నీ అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగాయి. ప్రిస్కిప్షన్ లేకుండా ఇన్ని స్లీపింగ్ పిల్స్ అమ్మిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకునేలా డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు సిఫారసు చేశాము. వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాధ్ రవీందర్.
  • వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజీలు పంపుతున్నాడు అని ట్రాఫిక్ హోంగార్డు పై షీ టీమ్ కు ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు లాక్‌డౌన్‌ సమయములో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ . కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టిన హోంగార్డ్ వెంకటేష్ . వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు . మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సీపీ అంజనీ కుమార్ . హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేసిన సిపిఐ అంజనీ కుమార్.
  • కరోనా తెలంగాణా బులిటిన్ ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు ఇవ్వాళ నలుగురు మృతి మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.. ఇవ్వాళ 24 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు..

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతోన్న ఆ దర్శకులు..!

RRR movie updates, RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతోన్న ఆ దర్శకులు..!

RRR movie news: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఈ సినిమాలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఈ మూవీలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, అలియా భట్ తదితరులు భాగం అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. అంతేకాదు రాజమౌళి ముందు చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. మిగిలిన ఇండస్ట్రీల్లోనూ ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా షూటింగ్‌లో ఆలస్యం అవ్వడం వలన ఈ మూవీ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో ఆర్ఆర్ఆర్ అదే రోజున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో.. అదే సమయానికి రావాలనుకున్న కొంతమంది దర్శకులు తమ సినిమాలను వాయిదా వేయాలనుకుంటున్నారట. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను దృష్టిలో పెట్టుకున్న వారు.. ఆర్ఆర్ఆర్‌కు పోటీ ఉండకపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు టాక్. అందుకే తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అక్కడ పరిస్థితి అలా ఉంటే.. టాలీవుడ్‌లో మాత్రం మరోలా ఉంది. వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్‌కు పోటీగా పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున తదితరులు బరిలో ఉండబోతున్నట్లు సమాచారం. కానీ వారి చిత్రాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, చెర్రీ ఫస్ట్‌లుక్‌లు వారి వారి పుట్టినరోజు నాడు రాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

Related Tags