Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది…

RRR Movie Update, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది…

RRR Movie Update: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. వచ్చే సంవత్సరం జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ‘బాహుబలి’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నామని అందుకే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ సరసన నటిస్తుండగా.. హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, సముద్రఖని, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న చిత్రం కావడం.. అంతేకాక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Tags