ఆ సీన్స్‌ను వెంటనే తొలగించాలి.. రాజమౌళికి మరోసారి వార్నింగ్..

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలు వ్యతిరేకించినా సినిమా తీస్తామంటే...

ఆ సీన్స్‌ను వెంటనే తొలగించాలి.. రాజమౌళికి మరోసారి వార్నింగ్..
Follow us

|

Updated on: Oct 31, 2020 | 5:48 PM

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలు వ్యతిరేకించినా సినిమా తీస్తామంటే తిరగబడతామని హెచ్చరించారు. కొమురం భీం వర్థంతి సందర్భంగా జోడేఘాట్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సినిమాలో కొమురం భీంను కించపరిచేలా చూపించారని ధ్వజమెత్తారు.

ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీం పాత్రకు.. ఆయన్ని చంపిన వాళ్ల వేషధారణ వేయడం కరెక్ట్ కాదని ఎంపీ సోయం బాపురావ్‌ తెలిపారు. కొమురంభీం పాత్రను మార్చకుండా.. అలాగే సినిమా విడుదల చేస్తే మాత్రం థియేటర్లను తగులబెడతామని వార్నింగ్‌ ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర తెలుసుకుని.. కొమురంభీం ఖ్యాతీని పెంచేలా సినిమా తీయాలని తెలిపారు.

అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమురం భీం వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాన్కాపూర్‌ నుంచి గుడిహత్నూర్‌ వరకు ఆదివాసీలు భారీగా తరలి వచ్చి కొమురం భీం విగ్రహానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీస్తే చూస్తూ ఊరుకోబోమని గిరిజన నేతలు రాజమౌళి వార్నింగ్‌ ఇచ్చారు.