Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఒకే పాటలో తారక్-చరణ‌్‌లు..! మరి స్టెప్పులుంటాయా..?

దర్శక ధీరుడుగా పేరు గాంచిన రాజమౌళి.. ఏ సినిమా చేసినా.. సెన్సేషనల్‌నే. అలాగే.. తన సినిమాలో ఏదో ఒక మార్క్ ఉండాలని అనుకుంటూంటాడు. ఈగ, బాహుబలి సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా.. తెలుగు సినిమా చరిత్ర తెలిసేలా.. అద్భుతాలు సృష్టించారు. కాగా.. తాజాగా.. ఆయన డైరెక్ట్ చేస్తున్న మరో సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంను భారీ అంచనాలతో, బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ విడుదల కావడానికి సమయం చాలానే ఉన్నా.. చిత్రానికి సంబంధించిన రూమర్స్.. మాత్రం చాలా ఇన్‌ట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. తాజాగా.. వచ్చిన న్యూస్‌ ఏటంటే.. తారక్-చరణ్‌ల మధ్య రాజమౌళి ఓ సాలిడ్ సాంగ్ పెట్టారనే పుకార్లు జోరుగా వైరల్ అవుతోన్నాయి.

ఆర్ఆర్ఆర్‌లో.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా.. చెర్రీ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఇద్దరూ స్వాతంత్ర సమర యోధులు.. వీరిద్దరూ.. ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందన్నది రాజమౌళి కథ. మరి కథకు తగ్గట్టుగానే.. ఈ సినిమాలో.. యాక్షన్స్ సీన్స్‌ గానీ.. ఎమోషన్‌‌ గానీ ఏమాత్రం తగ్గదనే అనిపిస్తోంది. అయితే.. సీతారామ రాజు, కొమరం భీమ్ కలిసే సన్నివేశంలో.. వీరిద్దరికీ ఓ సాంగ్ పెట్టాలని సరికొత్తగా ప్రణాళిక చేస్తున్నారట.. రాజమౌళి టీం.

అయితే.. ఎన్టీఆర్-చరణ్ ఇద్దరూ డ్యాన్స్‌లో దుమ్మురేపుతారు. ఎటువంటి స్టెప్పునైనా.. ఇరగదీస్తారు. మరి వాళ్లిద్దరి మధ్య సాంగ్‌ అంటే.. మామూలుగా ఉండదు. అయితే.. ఇది స్వాతంత్ర సమర యోధుల బ్యాగ్రౌండ్‌లో సినిమా ఉంటుంది కాబట్టి.. ఆ సాంగ్‌లో స్టెప్పులుంటాయా.. లేక సాదాసీదా సాగుతుందా అనేది టర్నింగ్ పాయింట్. అయితే.. ఆయన ఏదీ అంత ఈజీగా చేయడు చూద్దాం మరి ఆయన స్టోరీ ఎన్ని మ్యాజిక్‌లు చేస్తాడో.