Breaking News
  • మహారాష్ట్రలో వివాదాస్పదంగా మారిన వధావన్‌ కుటుంబం. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వధావన్‌ కుటుంబంపై ఎఫ్‌ఐఆర్. ఖండాలా నుంచి మహాబలేశ్వర్‌ వెళ్లిన 23 మంది వధావన్‌ కుటుంబ సభ్యులు. వధావన్‌ కుటుంబానికి అనుమతి పత్రం ఇచ్చిన.. మహారాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్‌ గుప్తా. అమితాబ్‌ గుప్తాను బలవంతపు సెలవుపై పంపిన ప్రభుత్వం. శాఖాపరమైన విచారణకు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశం. యెస్‌ బ్యాంక్‌ కుంభకోణంలో నిందితులుగా ఉన్న.. వధావన్‌ కుటుంబానికి చెందిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌. యెస్‌ బ్యాంక్‌ కేసులు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ. మహారాష్ట్ర పోలీసుల నుంచి వివరాలు కోరిన సీబీఐ, ఈడీ. మహాబలేశ్వర్‌ ఫామ్‌హౌస్‌లో క్వారంటైన్‌ చేసిన మహారాష్ట్ర సర్కార్‌.
  • అనంతపురం డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌కు అస్వస్థత. మంచినీళ్లు అనుకుని శానిటైజర్‌ తాగిన డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్. ప్రైవేట్‌ ఆస్పత్రిలో అనిల్‌కుమార్‌కు చికిత్స.
  • విశాఖలో కరోనా కట్టడికి యాక్షన్‌ ప్లాన్‌. మూడో దశకు చేరకుండా చర్యలు. కంటోన్మెంట్‌ జోన్‌లో ఆంక్షలు పక్కాగా అమలు. అక్కయ్యపాలెం, దొండపర్తి, రైల్వే న్యూ కాలనీ.. తాటిచెట్లపాలెంలో రహదారులు దిగ్బంధం. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసర వస్తువుల పంపిణీ. వాలంటీర్ల ద్వారా సరఫరాకు యాక్షన్‌ ప్లాన్.v
  • హైదరాబాద్‌: హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు. వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారుల ఇంటింటి సర్వే. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే చికిత్సకు ఏర్పాట్లు. అప్రమత్తంగా ఉన్న అన్ని శాఖల సిబ్బంది.
  • సంగారెడ్డి: కంగ్టి ఎంపీడీవో జైసింగ్‌ మృతి. వారం క్రితం మెట్లపై నుంచి జారిపడ్డ జైసింగ్. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.

Ram Charan : ​చరణ్​ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ అతడేనా..!

Vikram K Kumar To Direct This Star, Ram Charan : ​చరణ్​ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ అతడేనా..!

Ram Charan : ప్రస్తుతం జక్కన్న చెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు చెర్రీ దగ్గరికి భారీ స్క్రిప్ట్స్‌తో వెళ్లారు. కానీ ఏది కూడా చరణ్‌ను అంత ఎగ్జైట్ చెయ్యలేదట. కానీ ఇటీవల గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్న  విక్రమ్ కె. కుమార్​​.. మెగా పవర్​స్టార్​కు ఓ కథ వినిపించాడని ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అతడి దర్శకత్వంలో చరణ్‌ నటించేందుకు చరణ్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

కథలోని ఓ టర్నింగ్ పాయింట్ చెర్రీకి విపరీతంగా నచ్చిందట. దీంతో స్టోరీని ఇంకాస్త డెవలప్ చేసి రావల్సిందిగా మెగా పవర్ స్టార్..విక్రమ్‌కి చెప్పినట్టు సమాచారం.  ‘ఆర్​ఆర్​ఆర్​’ తర్వాత దాదాపు ఇతడి దర్శకత్వంలోనే మూవీ  ఖరారు కావొచ్చని ఫిల్మ్ వర్గాల బోగట్టా. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ అనౌన్సిమెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Vikram K Kumar To Direct This Star, Ram Charan : ​చరణ్​ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ అతడేనా..!

Related Tags