Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అమ్మో..! ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్ కోసం అన్ని కోట్లా..?

Rajamouli spending Rs 150 Cr for 2 Actions :RRR, అమ్మో..! ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్ కోసం అన్ని కోట్లా..?

టాలీవుడ్‌ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి చెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఫిక్షనల్ పాట్రియాటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. మొత్తం పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని మూవీ టీం అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.

రాజమౌళి స్థాయి ఇప్పుడు ‘బాహుబలి’మూవీతో వేరే రేంజ్‌కు వెళ్లింది. ఆయన సినిమా వస్తుందంటే ఎగబడి థియేటర్లకు వచ్చే జనాలు దేశ,విదేశాల్లో ఉన్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ‘ఆర్​ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్‌ను దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ పోరాట దృృశ్యాలు చూసే ఆడియెన్స్ మరో ట్రాన్స్‌లోకి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.350 కోట్లు అవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం జులై 30న మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.