ఉత్కంఠపోరులో రాయల్స్ అద్భుత విజయం

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే, బట్లర్‌లు కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే(37) […]

ఉత్కంఠపోరులో రాయల్స్ అద్భుత విజయం
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 7:55 PM

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే, బట్లర్‌లు కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే(37) సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ దశలో బట్లర్ చెలరేగిపోయాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించాడు. అయితే రాహుల్ చాహర్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి బట్లర్(89) భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శాంసన్(31) బుమ్రా వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరకూ పోరాడి రాయల్స్ 19.3 ఓవర్లలో 188 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.