Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

బోటు పైకి తీసే సమయంలో.. మీడియా పై ఎందుకు బ్యాన్..?

Kachuluru Boat Extraction, బోటు పైకి తీసే సమయంలో.. మీడియా పై ఎందుకు బ్యాన్..?

గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గిన నేపథ్యంలో.. బోటు వెలికితీత పై ఆశలు చిగురిస్తున్నాయి. సోమవారం బయటకు తీయాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ రోజు కూడా బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగిపోవడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. ఇక మంగళవారం మధ్యాహ్నం వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. దీంతో మరోసారి లంగర్ వేశారు.

రెండో సారి వేసిన లంగర్ ఐరన్ కొక్కెం పెద్దగా ఉండటంతో లంగర్‌కు బోటు తగిలిందని, బోటు కదిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇక రేపు బోటు వెలికితీయడం ఖాయం అని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. ఇదిలా ఉంటే, కచ్చులూరు వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. మీడియా పై బ్యాన్ ఎందుకు విధించారో.. అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజానీకాన్ని మాత్రం రానిస్తున్నారు.