IPL 2020: ఆర్‌సీబీ ‘యార్కర్ ఛాలెంజ్’.. విరాట్ కోహ్లీ డాన్స్‌లు..!

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్.. ఆ జట్టు బౌలర్లకు ఓ ఛాలెంజ్‌ను విసిరాడు. అదే 'యార్కర్ ఛాలెంజ్'. వికెట్ల చుట్టూ ఉన్న ఏరియాలో బంతి పడితే 1 పాయింట్‌గా

IPL 2020: ఆర్‌సీబీ 'యార్కర్ ఛాలెంజ్'.. విరాట్ కోహ్లీ డాన్స్‌లు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 9:45 PM

Royal Challengers Bangalore: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 53 రోజుల పాటు సాగనున్న ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10వ తేదీన జరగనుంది. ఇక లీగ్‌లో జరిగే 56 మ్యాచ్‌లను నిర్వహించడానికి దుబాయ్‌, అబుదాబి, షార్జా క్రికెట్‌ స్టేడియంలు సిద్ధమయ్యాయి. ఈసారి జరిగే ఐపీఎల్‌ ప్రత్యేకతేమిటంటే స్టేడియంలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా.. ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఇక అన్నీ టీమ్స్ దుబాయ్‌లో ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్.. ఆ జట్టు బౌలర్లకు ఓ ఛాలెంజ్‌ను విసిరాడు. అదే ‘యార్కర్ ఛాలెంజ్’. వికెట్ల చుట్టూ ఉన్న ఏరియాలో బంతి పడితే 1 పాయింట్‌గా, కింద అమర్చిన వికెట్లకు తగిలితే మూడు పాయింట్లు, చుట్టూ ఉన్న గుండ్రటి వాటిపై తగిలితే ఐదు పాయింట్లు అని అన్నాడు. చాహల్, సైనీ, ఉమేష్ యాదవ్ తదితరులు తమ బౌలింగ్ విన్యాసాలు చూపించారు. ఇవన్నీ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించిన ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. సిరాజ్ మొదటి బంతికే మధ్య స్టంప్‌ బీట్ చేసి పాయింట్లు సాధించడంతో కోహ్లీ ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గంతేశాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూడండి.