‘మై కొవిడ్‌ హీరోస్’‌ ఆర్బీసీ కొత్త జెర్సీ..!

ఐపీఎల్ పండుగకు మరికొన్ని గంటలే మిగిలివుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL‌) 13వ సీజన్‌ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదిరి చూస్తున్నారు. అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పడికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ వేదికగా జరుగనున్న ఈ ఆట..

'మై కొవిడ్‌ హీరోస్'‌ ఆర్బీసీ కొత్త జెర్సీ..!
Follow us

|

Updated on: Sep 17, 2020 | 7:08 PM

 RCB to Don My Covid Heroes : ఐపీఎల్ పండుగకు మరికొన్ని గంటలే మిగిలివుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL‌) 13వ సీజన్‌ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదిరి చూస్తున్నారు. అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పడికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దుబాయ్ వేదికగా జరుగనున్న ఈ ఆట కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ‘మై కొవిడ్‌ హీరోస్’‌ కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటించింది. అహర్నిశలు శ్రమిస్తున్న కొవిడ్‌ యోధుల త్యాగాలు, వారి సేవలను గుర్తించి గౌరవించడంలో భాగంగా ఐపీఎల్‌ 2020 టోర్నీ ముగిసేవరకు శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో ‘మై కొవిడ్‌ హీరోస్’‌ సందేశంతో ఆర్‌సీబీ బృందం నూతన జెర్సీలను ధరించనుంది.

13వ సీజన్‌లో బెంగళూరు జట్టు ఆడే మొదటి మ్యాచ్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలను వేలం వేసి వాటి ద్వారా వచ్చే నగదు మొత్తాన్ని గివ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.