ఈ సాలా కప్ నమ్‌దే.. ఆర్‌సీబీ కొత్త అస్త్రాలు సిద్దం..

ఈ సాలా కప్ నమదే.. విరాట్ కోహ్లి సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం. దీని అర్ధం అందరికి తెలిసిందే. కానీ పన్నెండు సీజన్లలో ఒకసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయింది.

ఈ సాలా కప్ నమ్‌దే.. ఆర్‌సీబీ కొత్త అస్త్రాలు సిద్దం..
Follow us

|

Updated on: Sep 17, 2020 | 5:24 PM

ఈ సాలా కప్ నమదే.. విరాట్ కోహ్లి సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం. దీని అర్ధం అందరికి తెలిసిందే. కానీ పన్నెండు సీజన్లలో ఒకసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. అయితే ఈ ఏడాది మాత్రం ఎలాగైనా విజేతగా నిలిచేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే యూఏఈ కెప్టెన్ అహ్మద్‌ రజా, యువ ఆటగాడు కార్తీక్‌ మెయప్పన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అక్కడి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. (Royal Challengers Bangalore)

వీరిద్దరికీ తమ ఆటగాళ్లతో పాటు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ స్థానికులు కావడం అంతేకాకుండా అక్కడ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉండటం కలిసొచ్చే అంశంగా ఆర్‌సీబీ భావిస్తోంది. అహ్మద్ రజా ఆల్‌రౌండర్ కావడం వల్ల జట్టులోని ఆటగాళ్లకు అతడి ద్వారా మెలుకువలు నేర్పించడంతో పాటు అవసరమైతే అతన్ని బరిలోకి దింపాలని ఆర్సీబీ అనుకుంటోందట. గతంలో ఆస్ట్రేలియా జట్టు యూఏఈలో పర్యటించినప్పుడు.. ఆ జట్టుకు రజా స్పిన్ సలహాదారుడిగా పని చేశాడు. దీనితో బెంగళూరు బౌలింగ్‌ కోచ్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ అతడ్ని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆర్సీబీ జట్టుతో సాధన చేసిన విషయాన్ని రజా అభిమానులతో పంచుకున్నాడు.