ట్రోఫీనే టార్గెట్.. ఆర్‌సీబీలో సంచలన మార్పులు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పెర్ఫార్మన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మేటి ఆటగాళ్లు, అపారమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్ళు, అనుభవజ్ఞులైన కోచింగ్ స్టాఫ్ ఉన్నా ట్రోఫీని మాత్రం గెలవలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020 ట్రోఫీని టార్గెట్ చేస్తూ ఫ్రాంచైజీ జట్టు కోచింగ్‌ బృందాన్ని మార్చాలని నిర్ణయించింది. గ్యారీ కిర్‌స్టన్‌, ఆశిష్‌ నెహ్రాలపై వేటు వేస్తూ […]

ట్రోఫీనే టార్గెట్.. ఆర్‌సీబీలో సంచలన మార్పులు!
Follow us

|

Updated on: Aug 23, 2019 | 8:50 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పెర్ఫార్మన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మేటి ఆటగాళ్లు, అపారమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్ళు, అనుభవజ్ఞులైన కోచింగ్ స్టాఫ్ ఉన్నా ట్రోఫీని మాత్రం గెలవలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020 ట్రోఫీని టార్గెట్ చేస్తూ ఫ్రాంచైజీ జట్టు కోచింగ్‌ బృందాన్ని మార్చాలని నిర్ణయించింది. గ్యారీ కిర్‌స్టన్‌, ఆశిష్‌ నెహ్రాలపై వేటు వేస్తూ కొత్త కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేసింది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాజీ కోచ్‌, ఇటీవల టీమిండియా హెడ్‌కోచ్‌ పదవికి పోటీపడిన మైక్‌ హెస్సెన్‌ను క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా… ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ సైమన్‌ కటిచ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేస్తూ ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.