వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. నడి రోడ్డుపై హత్య!

వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పట్టపగలు నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం… రౌడీషీటర్‌ శివ ఈరోజు ఉదయం ద్విచక్రవాహనంపై వేములవాడలోని టాకీస్‌ రోడ్డులో వెళ్తుండగా ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. మాజీ కౌన్సిలర్‌ వెంకటేశంతో పాటు మరో వ్యక్తి .. శివను అడ్డుకుని కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శివ మృతి చెందాడు. వేములవాడ మున్సిపాలిటీలోని […]

వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు..  నడి రోడ్డుపై హత్య!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 3:23 PM

వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పట్టపగలు నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం… రౌడీషీటర్‌ శివ ఈరోజు ఉదయం ద్విచక్రవాహనంపై వేములవాడలోని టాకీస్‌ రోడ్డులో వెళ్తుండగా ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. మాజీ కౌన్సిలర్‌ వెంకటేశంతో పాటు మరో వ్యక్తి .. శివను అడ్డుకుని కత్తులతో పొడిచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శివ మృతి చెందాడు.

వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్‌ టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. దాడి తర్వాత వెంకటేశం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.