Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రోజా భర్త.. వాలీడ్ రీజనే సుమా!

roja husband comments on rajnikanth, రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రోజా భర్త.. వాలీడ్ రీజనే సుమా!

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సమరానికి దిగారు. రోజా భర్తకు రజనీకాంత్‌కు లింకేంటన్న అనుమానం కలిగినా ఇది నిజం. రజనీకాంత్ వైఖరిపై మండిపడుతున్న రోజా భర్త.. సూపర్ స్టార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రజనీకాంత్‌పై బహిరంగ విమర్శలకు దిగుతున్న రోజా భర్త ఇప్పుడు కోలీవుడ్‌లో వివాదానికి కేంద్రబిందువయ్యారు.

రోజా భర్త తమిళ సినీ దర్శకుడు సెల్వమణి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. గత కొంత కాలంగా సెల్వమణికి సినిమాలు పెద్దగా లేవు. దాంతో రాజకీయాల్లో రోజాకు చేదోడుగా వుంటూనే తమిళ దర్శకుల సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు దర్శకత్వం నెరపిన సెల్వమణికి ఇప్పటికీ సినిమా పరంగా ఫాలోయింగ్‌ బాగానే ఉంది. కానీ ఆయన ఇటీవల చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. తమిళ సినీ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

roja husband comments on rajnikanth, రజనీకాంత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రోజా భర్త.. వాలీడ్ రీజనే సుమా!

తమిళనాట ఇప్పుడు అసలు సినిమాలు ఆడకపోవడానికి ఏవరు అనే అంశంపై చర్చ మొదలైంది. సినిమాకు హైప్ వచ్చేలా చేసే హీరోలా? లేక అంఛనాలకు అనుగుణంగా సినిమాను తీయలేకపోయిన దర్శకులా? ఈ చర్చకు తెరలేపింది సెల్వమణి వ్యాఖ్యలే.

రజనీకాంత్‌ హీరోగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా దర్బార్‌. ఈ సినిమాపై తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. కొందరు రజనీకాంత్‌ టార్గెట్‌ చేస్తే…మరికొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. మొత్తానికి దర్బార్‌ సినిమాపై తమిళ సినీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

దర్బార్‌ మూవీ నష్టాలతో కొందరు బయ్యర్లు ఉద్యమ బాట పట్టారు. దర్బార్‌ సినిమా కొనుగోలు చేయడం వల్ల సుమారు 50 కోట్లకు పైగా నష్టపోయామని…తమకు న్యాయం చేయాలని ఇటీవల రజనీకాంత్‌ ఇంటిని ముట్టడించేందుకు బయ్యర్లు ప్రయత్నించారు. నిర్మాణ సంస్థ పట్టించుకోకపోవడంతో హీరో రజనీకాంత్‌, డైరెక్టర్‌ మురుగదాస్‌ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అయితే ఇప్పటివరకూ ఈ కహానీలో పెద్ద ట్విస్ట్‌లు ఏం లేవు. కానీ నగరి ఎమ్మెల్యే రోజా భర్త, తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు సెల్వమణి చేసిన కామెంట్స్‌పై రజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా వల్ల కలిగే నష్టానికి నిర్మాతలు బాధ్యత తీసుకోవాలని…. దర్శకుల్ని బాధ్యులను చేయడం సరికాదని సెల్వమణి వ్యాఖ్యానించారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి హీరో రజనీకాంత్‌ కారణమని సెల్వమణి విమర్శలు గుప్పించారు.

గతంలో సినిమా కొని నష్టపోయిన వాళ్లకి తిరిగి డబ్బులు ఇచ్చే సంప్రదాయాన్ని రజనీకాంత్‌ తీసుకొచ్చారని…దాని వల్లే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందని అన్నారాయన. సినిమా ఆడకపోయినా ప్రతిసారి ఈ సమస్య రావడానికి రజనీ కారణమని దుమ్మెత్తిపోశారు. ఆయనకు ఇవ్వాలనిపిస్తే తిరిగి ఇవ్వొచ్చని… ఇందులోకి దర్శకులు లాగడం సరికాదు అనేది సెల్వమణి పాయింట్‌. అయితే ఈ కామెంట్స్‌పై రజనీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. దర్శకుడు మురుగదాస్‌ వల్లే సినిమాకు ఈ పరిస్థితి వచ్చిందని…సినిమా ఆడకపోవడానికి డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఇన్‌డైరెక్టుగా సెల్వకు చురకలు వేస్తున్నారు. సెల్వమణి రజనీకాంత్‌పై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Related Tags