త‌న రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన రోహిత్ శ‌ర్మ‌…

టీమిండియా ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. తాజాగా త‌న రిటైర్మైంట్‌పై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశాడు. తను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు ఎప్పుడు వీడ్కోలు పలుకుతాన‌నే విష‌యంపై 33 ఏళ్ల హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో సోష‌ల్ మీడియాతో రోహిత్ వివిధ అంశాల‌పై చ‌ర్చించాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. 38,39 ఏళ్లు వ‌చ్చే స‌రికి త‌ను ఆట‌కు గుడ్ బై చెబుతాన‌ని వెల్ల‌డించాడు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా […]

త‌న రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన రోహిత్ శ‌ర్మ‌...
Follow us

|

Updated on: May 10, 2020 | 4:21 PM

టీమిండియా ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. తాజాగా త‌న రిటైర్మైంట్‌పై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశాడు. తను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు ఎప్పుడు వీడ్కోలు పలుకుతాన‌నే విష‌యంపై 33 ఏళ్ల హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో సోష‌ల్ మీడియాతో రోహిత్ వివిధ అంశాల‌పై చ‌ర్చించాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. 38,39 ఏళ్లు వ‌చ్చే స‌రికి త‌ను ఆట‌కు గుడ్ బై చెబుతాన‌ని వెల్ల‌డించాడు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డ‌టంతో క్రికెట‌ర్లు అంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే.

రోహిత్ కెరీర్ ఒక‌సారి గమ‌నిస్తే…

2007లో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కి ఎంట్రీ ఇచ్చిన‌ రోహిత్ శ‌ర్మ‌.. అదే ఏడాది జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుపొందిన ఇండియా జ‌ట్టులో మెంబ‌ర్ అవ్వ‌డం విశేషం. అయితే కెరీర్ తొలినాళ్లలో నిల‌క‌డ‌లేని ఆట‌తీరుతో జ‌ట్టు నుంచి చాలాసార్లు ఉద్వాస‌న‌కు గుర‌య్యాడు. అయితే ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్న‌ప్పుడు అత‌ని‌పై నమ్మ‌క‌ముంచి ఎన్నో అవ‌కాశాలు కల్పించాడు. ఇక 2013 చాంపియ‌న్ ట్రోఫీలో ఓపెన‌ర్‌గా దిగాక‌ రోహిత్ భీక‌ర ఫామ్ ప్ర‌ద‌ర్శించాడు. అప్ప‌టి నుంచి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి త‌న ప్లేస్ ప‌ర్మ‌నెంట్ చేసుకున్నాడు. గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా ఐదు సెంచ‌రీలు చేసి వ‌ర‌ల్డ్ రికార్డ్ నెల‌కొల్పాడు. అలాగే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాడు రోహితే కావ‌డం విశేషం.