వరల్డ్‌కప్‌ ముందు భారత్‌కు ఎదురుదెబ్బ

ముంబై: వరల్డ్‌ కప్‌‌కు ముందు భారత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు గాయమైంది. పంజాబ్‌తో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న రోహిత్‌.. ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేశాడు. అప్పుడు అతని కుడికాలి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో నితిన్‌ పటేల్‌ సహయంతో అతి కష్టం మీద మైదానం నుంచి బయటకు వెళ్లడం జరిగింది. రోహిత్ శర్మకు పెద్ద గాయమే అయ్యిందని.. కోలుకోవడానికి కనీసం 2 నుంచి 6 […]

వరల్డ్‌కప్‌ ముందు భారత్‌కు ఎదురుదెబ్బ
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 10, 2019 | 7:35 PM

ముంబై: వరల్డ్‌ కప్‌‌కు ముందు భారత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు గాయమైంది. పంజాబ్‌తో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న రోహిత్‌.. ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేశాడు. అప్పుడు అతని కుడికాలి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో నితిన్‌ పటేల్‌ సహయంతో అతి కష్టం మీద మైదానం నుంచి బయటకు వెళ్లడం జరిగింది.

రోహిత్ శర్మకు పెద్ద గాయమే అయ్యిందని.. కోలుకోవడానికి కనీసం 2 నుంచి 6 వారాలు పడుతుందని ఫిజియోలు వెల్లడించారు. అయితే ప్రపంచకప్‌ లోపు రోహిత్‌ కోలుకునే అవకాశాలున్నాయని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు.. రోహిత్ శర్మ అటు భారత్ జట్టుకు, ఇటు ముంబై ఇండియన్స్ జట్టుకు కీలక ఆటగాడు కావడంతో రోహిత్ శర్మ గాయం ఇరు జట్లకు ఆందోళన కలిగిస్తోంది.