సెంచరీల వేటలో… భారత్ బ్యాట్స్‌మెన్!

వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున ఈ ఏడాది అత్యధిక శతకాలు సాధించే వారిలో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల మధ్య పోటాపోటీ నెలకొంది. మరో నాలుగు నెలల్లో 2019 పూర్తవుతుందనగా భారత జట్టు ఇంకా మూడు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శతకాల వేటలో పడ్డారు. ఇటీవల ముగిసిన ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఐదు శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఒక […]

సెంచరీల వేటలో... భారత్ బ్యాట్స్‌మెన్!
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 5:48 PM

వన్డేల్లో టీమ్‌ఇండియా తరఫున ఈ ఏడాది అత్యధిక శతకాలు సాధించే వారిలో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల మధ్య పోటాపోటీ నెలకొంది. మరో నాలుగు నెలల్లో 2019 పూర్తవుతుందనగా భారత జట్టు ఇంకా మూడు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శతకాల వేటలో పడ్డారు. ఇటీవల ముగిసిన ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఐదు శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో ఒక శతకం బాదడంతో ఈ ఏడాది మొత్తం ఆరుసార్లు మూడంకెల స్కోర్‌ సాధించాడు.

మరోవైపు కోహ్లీ.. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో తొలి శతకం సాధించగా తర్వాత అదే జట్టు భారత పర్యటనలో రెండు సెంచరీలు చేశాడు. ఇక ప్రపంచకప్‌లో బాగా రాణించినా మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోయాడు. తాజాగా విండీస్‌ పర్యటనలో రెండు వరుస శతకాలు బాదడంతో.. ఈ ఏడాది మొత్తం ఐదు సెంచరీలు చేశాడు. విండీస్‌ పర్యటన తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ జట్లతో కోహ్లీసేన తలపడనుంది. దీంతో డిసెంబర్‌ వరకు ఆడే వన్డేల్లో రోహిత్‌, కోహ్లీ చెలరేగితే మరిన్ని శతకాలు నమోదు చేస్తారు.