T20I: ‘నువ్వా నేనా’ అంటున్న కోహ్లీ, రోహిత్!

అంతర్జాతీయ టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత బుధవారం సాధించిన నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి 7 గంటలకి బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 8 పరుగులు సాధిస్తే..? టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డ్ నెలకొల్పనున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పరిమితంకానున్నాడు. మొహాలి టీ20లో రోహిత్ శర్మ 12 పరుగులకే ఔటవగా.. విరాట్ కోహ్లీ […]

T20I: 'నువ్వా నేనా' అంటున్న కోహ్లీ, రోహిత్!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 12:44 PM

అంతర్జాతీయ టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత బుధవారం సాధించిన నెం.1 రికార్డ్‌పై ఓపెనర్ రోహిత్ శర్మ కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి 7 గంటలకి బెంగళూరు వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 8 పరుగులు సాధిస్తే..? టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డ్ నెలకొల్పనున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పరిమితంకానున్నాడు. మొహాలి టీ20లో రోహిత్ శర్మ 12 పరుగులకే ఔటవగా.. విరాట్ కోహ్లీ అజేయంగా 72 పరుగులు చేసి టీమిండియాని గెలిపించిన విషయం తెలిసిందే.

టీ20ల్లో ఇప్పటి వరకూ 71 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ.. 50.85 సగటుతో 2,441 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని స్ట్రైక్‌రేట్ 135.91గా ఉండగా.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 97 టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 32.45 సగటుతో 2,434 పరుగులు చేశాడు. అయితే.. అనూహ్యంగా అతని స్ట్రైక్‌రేట్ కోహ్లీ కంటే ఎక్కువగా 136.6గా ఉండటం విశేషం. టీ20ల్లో ఇప్పటికే రోహిత్ శర్మ 4 శతకాలు, 17 హాఫ్ సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లీ మాత్రం కనీసం ఒక్క శతకం మార్క్‌ని కూడా అందుకోలేకపోయాడు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం విరాట్ కోహ్లీ 5 శతకాలు బాదేసిన విషయం తెలిసిందే.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీకే మెరుగైన రికార్డ్ ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన విరాట్ కోహ్లీ‌కి.. ఈ స్టేడియం కొట్టినపిండి. ఈ నేపథ్యంలో.. రోహిత్ శర్మ 8 పరుగులతో నెం.1 రికార్డ్‌ని ఒకవేళ సొంతం చేసుకున్నా.. నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డ్‌ని మళ్లీ కోహ్లీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. దీనికి కారణంగా పరుగులు వ్యత్యాసం తక్కువగా ఉండటమే..!