ఎట్టకేలకు ఐదుగురిని చంపిన ‘బిన్ లాడెన్’ ఏనుగు పట్టివేత!

ఐదుగురు భారతీయ గ్రామస్తులను చంపిన దివంగత అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ పేరు మీద ఉన్న ఏనుగు… భారీ ఆపరేషన్ తర్వాత పట్టుబడిందని అధికారులు సోమవారం తెలిపారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో “లాడెన్” గా పిలువబడే దీనిని, డ్రోన్లు మరియు పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవి ద్వారా వన్యప్రాణి అధికారులు ట్రాక్ చేశారు. ‘నిపుణులైన షూటర్లు ట్రాంక్విలైజర్లతో రెండు సార్లు కాల్చగానే ఆ ఏనుగుకి మత్తెక్కి పడిపోయింది.’ అని అటవీ అధికారి తెలిపారు. […]

ఎట్టకేలకు ఐదుగురిని చంపిన  'బిన్ లాడెన్' ఏనుగు పట్టివేత!
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 4:38 PM

ఐదుగురు భారతీయ గ్రామస్తులను చంపిన దివంగత అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ పేరు మీద ఉన్న ఏనుగు… భారీ ఆపరేషన్ తర్వాత పట్టుబడిందని అధికారులు సోమవారం తెలిపారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో “లాడెన్” గా పిలువబడే దీనిని, డ్రోన్లు మరియు పెంపుడు ఏనుగులను ఉపయోగించి చాలా రోజుల పాటు అడవి ద్వారా వన్యప్రాణి అధికారులు ట్రాక్ చేశారు. ‘నిపుణులైన షూటర్లు ట్రాంక్విలైజర్లతో రెండు సార్లు కాల్చగానే ఆ ఏనుగుకి మత్తెక్కి పడిపోయింది.’ అని అటవీ అధికారి తెలిపారు. ఇప్పుడు ఆ ఏనుగును సమీపంలో మానవ నివాసాలు లేని అడవికి తరలించే పని జరుగుతోంది అని తెలిపారు.

అక్టోబర్లో గోల్పారా జిల్లా ఈ ఏనుగు ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని చంపింది. ఏనుగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అలాగే ఎక్కడ నివసిస్తారో నిర్ణయించడంలో సమీపంలో నివసించే ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. జూన్ లో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, గత ఐదేళ్ళలో భారతదేశంలో దాదాపు 2,300 మంది ఏనుగుల చేత చంపబడ్డారు, 2011 నుండి 700 ఏనుగులు చంపబడ్డాయి.