Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

రాక్‌స్టార్ ఇది నిజమేనా..?

DSP gets big offer, రాక్‌స్టార్ ఇది నిజమేనా..?

రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరులో ఓ మ్యాజిక్ ఉంది. ఆయన పాటలు వింటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఊపు రావడం ఖాయం. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో నంబర్ 1గా కొనసాగుతున్న ఈ సంగీత దర్శకుడికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్, కోలీవుడ్ కాదు బాలీవుడ్‌లో ఓ పెద్ద నిర్మాణ సంస్థ నుంచి డీఎస్పీకి కాల్ వచ్చినట్లు టాక్.

రణ్‌వీర్ సింగ్, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా ప్రముఖ యశ్‌రాజ్ సంస్థ జయేష్ భాయి జోర్దార్ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రణ్‌వీర్ సింగ్ గుజరాతీగా కనిపించనుండగా… దివ్యాంగ్ టక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ రాక్‌స్టార్‌తో సంప్రదింపులు జరిపిందని, ఆయన ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్.

అయితే కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌, కోలీవుడ్‌‌లో దాదాపుగా స్టార్ హీరోలందరితో దేవీ కలిసి పనిచేశాడు. ఇక బాలీవుడ్‌లోనూ ఆయన పాటలు వినిపించాయి. ముఖ్యంగా ఆర్య 2లో ఫేమస్ అయిన రింగ రింగ పాటను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఢీంక చక.. ఢీంక చక పేరుతో రీమేక్ చేయించుకున్నాడు. అంతేకాదు డీఎస్పీ ప్రతిభను గుర్తించిన సల్మాన్.. ఆయన నటించిన జయహో చిత్రంలో నాచ్‌రే అనే ఓ ప్రత్యేక పాటను అడిగి మరీ చేయించుకున్నాడు. అంతేకాదు దేవీ కంపోజ్ చేసిన ఆ అంటే అమలాపురం.. ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్‌లు కూడా బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. ఇవన్నీ అక్కడ భారీ విజయాన్ని సాధించాయి. ఇక రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ జంజీర్‌కు కూడా మ్యూజిక్ డైరక్టర్‌గా దేవీ పేరునే వినిపించినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు దేవీ. వీటితో పాటు పలు సినిమాల్లో కొన్ని పాటలను చేసేందుకు కూడా ఆయనను సంప్రదించారని.. కానీ సినిమా మొత్తం తాను చేసేందుకు ఆసక్తిని చూపే దేవీ, వాటిని వదులుకున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జయేష్ భాయి జోర్దార్‌ సినిమాపై దేవీ గురించి అధికారిక ప్రకటన వస్తే.. బాలీవుడ్‌లో ఆయన చేయబోయే మొదటి చిత్రం ఇదే అవుతుంది.