అమెరికా దళాల ‘ఇరాక్ ఎయిర్ బేస్‌’పై రాకెట్ల దాడి!

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిస్తున్న ఇరాక్ యొక్క బలాడ్ ఎయిర్ బేస్ లోపల ఆదివారం ఏడు మోర్టార్ బాంబులు పడ్డాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం […]

అమెరికా దళాల 'ఇరాక్ ఎయిర్ బేస్‌'పై రాకెట్ల దాడి!
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 12:40 AM

ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మరోసారి దాడులకు పాల్పడింది. ఇరాక్‌లోని బలాడ్ వైమానిక స్థావరంపై జరిగిన రాకెట్ల దాడిలో కనీసం నలుగురు సైనికులు గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాధమిక నివేదికల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిస్తున్న ఇరాక్ యొక్క బలాడ్ ఎయిర్ బేస్ లోపల ఆదివారం ఏడు మోర్టార్ బాంబులు పడ్డాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బాగ్దాద్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న బేస్ లోపల ఉన్న రన్‌వేలో మోర్టార్ బాంబులు పడ్డాయని సైనిక వర్గాలు తెలిపాయి. బలాద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు ఇరాకీ సైనికులు గాయపడ్డారు.

గత రెండు వారాలుగా అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న అల్-బలాద్ ఎయిర్‌బేస్‌లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళంలో ఎక్కువ మంది అక్కడినుండి వెళ్లిపోయారని సైనిక వర్గాలు తెలిపాయి. ఇరానియన్ జనరల్ కస్సేమ్ సోలైమాని హత్య తరువాత అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో యునైటెడ్ స్టేట్స్ దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు గత కొద్ది రోజులుగా రాకెట్, మోర్టార్ దాడులకు గురయ్యాయి.