దుస్తులను మడతపెట్టే రోబో!

దుస్తులను మడత పెట్టి అల్మారాలో పెట్టాలంటే చాలా కష్టం. దీంతో చాలామంది వాటిని ఇస్త్రీకి ఇచ్చేస్తుంటారు. అయితే, ఆ అవసరం లేకుండా 12 ఏళ్ల నైజీరియా బాలిక ఫాతిమా అద్భుల్లాహీ సరికొత్త రోబోను కనిపెట్టింది. అందులో బట్టలు పెట్టి వదిలేస్తే చాలు.. అదే మడత పెట్టేస్తుంది. ఈ రోబో మూడు సెకన్ల వ్యవధిలో ఒక వస్త్రాన్ని మడత‌ పెట్టేయగలదు. ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ.. ‘‘ఇది టీషర్ట్ ఫోల్డర్. శనివారం, ఆదివారం రాగానే చాలా దుస్తులను మడత […]

దుస్తులను మడతపెట్టే రోబో!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 17, 2019 | 7:27 AM

దుస్తులను మడత పెట్టి అల్మారాలో పెట్టాలంటే చాలా కష్టం. దీంతో చాలామంది వాటిని ఇస్త్రీకి ఇచ్చేస్తుంటారు. అయితే, ఆ అవసరం లేకుండా 12 ఏళ్ల నైజీరియా బాలిక ఫాతిమా అద్భుల్లాహీ సరికొత్త రోబోను కనిపెట్టింది. అందులో బట్టలు పెట్టి వదిలేస్తే చాలు.. అదే మడత పెట్టేస్తుంది.

ఈ రోబో మూడు సెకన్ల వ్యవధిలో ఒక వస్త్రాన్ని మడత‌ పెట్టేయగలదు. ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ.. ‘‘ఇది టీషర్ట్ ఫోల్డర్. శనివారం, ఆదివారం రాగానే చాలా దుస్తులను మడత పెట్టాల్సి వస్తోంది. దీంతో ఈ రోబోను తయారు చేశాను. కొన్ని పిన్, బీమ్, ఈవీ3 బ్రిక్‌లు ఉపయోగించి దీన్ని రూపొందించాను’’ అని తెలిపింది. అమెరికాలో దుస్తులు మడతపెట్టే యంత్రాల విలువ వెయ్యి డాలర్లు ఉంటుంది. అయితే, అంతకంటే తక్కువ ధరలోనే ఈ రోబోను తయారు చేశానని ఫాతిమా చెబుతోంది.