హేమామాలిని బుగ్గల్లాంటి రోడ్లు చూడాలా ? అయితే మధ్యప్రదేశ్‌కెళ్ళండి !!

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలాంటి సున్నితమైన, సుందరమైన రోడ్డు చూడాలా ? ఒక్క క్షణం ఆలోచించకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళండి.. అక్కడి రాష్ట్ర మంత్రి పిసి శర్మని కలిస్తే చాలు.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గల్లాంటి అందమైన రోడ్లను చూపించేస్తారు.. ఎంచక్కా మీ కారు మీదో.. లేక బైకు మీదో ఆ సుందరమైన రోడ్డులపై చక్కర్లు కొట్టేసి రండి.. వినేందుకు. కాదు కాదు చదివేందుకు ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎంపీ కేబినెట్ […]

హేమామాలిని బుగ్గల్లాంటి రోడ్లు చూడాలా ? అయితే మధ్యప్రదేశ్‌కెళ్ళండి !!
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 9:50 PM

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలాంటి సున్నితమైన, సుందరమైన రోడ్డు చూడాలా ? ఒక్క క్షణం ఆలోచించకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళండి.. అక్కడి రాష్ట్ర మంత్రి పిసి శర్మని కలిస్తే చాలు.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గల్లాంటి అందమైన రోడ్లను చూపించేస్తారు.. ఎంచక్కా మీ కారు మీదో.. లేక బైకు మీదో ఆ సుందరమైన రోడ్డులపై చక్కర్లు కొట్టేసి రండి.. వినేందుకు. కాదు కాదు చదివేందుకు ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎంపీ కేబినెట్ మంత్రి పిసి శర్మ స్వయంగా ఇస్తున్న హామీ ఇది.

వివరాలివే..

మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి పిసి శర్మ గురువారం రాష్ట్ర రాజధాని భోపాల్ శివార్లలో హబీబ్ గంజ్ ప్రాంతంలో పర్యటించారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను చూసి అవాక్కయ్యారు. గతవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో విపక్ష బిజెపికి చెందిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి సదరు మంత్రి గారికి. దీనికి తోడు మంత్రి గారి పర్యటనలో పలువురు రోడ్ల దుస్థితి గురించి ప్రశ్నించడం కూడా ఆయనకు చిరాకు తెప్పించింది.

ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆదేశాల మేరకు 15 రోజుల్లో రోడ్ల మరమ్మతులు చేపడతామని చెబుతూనే.. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత వస్తే హబీబ్ గంజ్ రోడ్లు హేమామాలిని బుగ్గల్లా సుందరంగా కనిపిస్తాయంటూ అసంబద్ద వ్యాఖ్యలు చేశారు. రోడ్ల రిపేర్ ఏంటో గానీ.. రోడ్లను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో గౌరవ ప్రదమైన స్థానంలో వున్న బిజెపి ఎంపీ హేమామాలిని పేరును ప్రస్తావించడం.. ఆమె బుగ్గల్లాంటి రోడ్లు వేయిస్తానంటూ అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఇపుడు దుమారం రేపుతోంది. సహజంగానే బిజెపి నేతలే పిసి శర్మ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.

దాంతో ఈ కామెంట్ల వెనుక అసలు ఉద్దేశం ఇదేనంటూ మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. గతంలో ముఖ్యమంత్రిగా వున్న శివరాజ్ సింహ్ చౌహాన్ 2017లో అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత వాషింగ్టన్ రోడ్లకంటే మధ్యప్రదేశ్ రోడ్లే బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన అధికారం నుంచి దిగిపోగా.. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. అయితే గతంలో వాషింగ్టన్ రోడ్లకంటే బావున్న ఎంపీ రోడ్లను కమల్ నాథ్ అధికారంలోకి వచ్చాక అత్యంత దయనీయంగా మార్చారంటూ బిజెపి నేత గోపాల్ భార్గవ అక్టోబర్ 12న ట్వీట్ చేశారు. గోపాల్ భార్గవ ట్వీట్‌కు ప్రతీకారంగా అమెరికా లాంటి రోడ్లు కాదు.. హేమామాలిని బుగ్గల్లాంటి రోడ్లను వేయిస్తానంటూ తమ మంత్రి పిసి శర్మ బిజెపికి చురకంటించారు గానీ.. హేమా మాలినిని కించపరిచే ఉద్దేశం లేదంటూ  కాంగ్రెస్ నేతలు వివరణలు ఇచ్చుకుంటున్నారు.

ఏది ఏమైనా రాజకీయ నాయకులు అందునా గౌరవప్రదమైన స్థానంలో వున్నవారి డిగ్నిటీ దిగజార్చుకుని కామెంట్లు చేస్తే తలబొప్పి కట్టేదాకా సోషల్ మీడియా వదలదన్న సంగతి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.