కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

బెంగ‌ళూరు-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో జీపును ఓల్వో బస్సు ఢీ కొనడంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలులోని సర్వజనాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బైక్‌ను తప్పించబోయి వోల్వో బస్‌ను తుఫాన్ వాహనం ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. కాగా.. తుఫాన్ వాహనంలో పెళ్లిచూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జ‌ర‌గ‌డంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. మృతులు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం వాసులుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *