రితికా సింగ్ ‘మీ టూ’ మూవీకి సెన్సార్ అడ్డంకులు

‘మీ టూ’ అనే మూమెంట్ సమాజంలోని అన్ని రంగాల్లో చీకటి పొరలను ఎత్తి చూపించింది. చిత్ర పరిశ్రమలో అంతకుమించి ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు ‘మీ టూ’ అనే టైటిల్ తో తీసిన చిత్రం వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ టైటిల్ ని మార్చాలని, కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఎడిట్ చేస్తేనే ఈ మూవీ విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. హర్షవర్ధన్ అనే దర్శకుడు..తీసిన ఈ […]

రితికా సింగ్ 'మీ టూ' మూవీకి సెన్సార్ అడ్డంకులు
Follow us

|

Updated on: Mar 08, 2019 | 3:30 PM

‘మీ టూ’ అనే మూమెంట్ సమాజంలోని అన్ని రంగాల్లో చీకటి పొరలను ఎత్తి చూపించింది. చిత్ర పరిశ్రమలో అంతకుమించి ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు ‘మీ టూ’ అనే టైటిల్ తో తీసిన చిత్రం వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ టైటిల్ ని మార్చాలని, కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఎడిట్ చేస్తేనే ఈ మూవీ విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. హర్షవర్ధన్ అనే దర్శకుడు..తీసిన ఈ చిత్రంలో గురు మూవీ హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించింది. అమాయకురాలైన ఓ యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి కారులోనే ఆమెపై అత్యాచారం చేసిన ఘటన నేపథ్యంగా ఈ సినిమా సాగింది. హర్యానాలో నెలరోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది. అయితే ‘మీ టూ’ ఉద్యమాన్ని ఈ మూవీ తప్పుదారి పట్టించేదిగా ఉందని, అందువల్ల మొదట ఈ సినిమా టైటిల్ మార్చాలని ముంబైలోని సెన్సార్ బోర్డు మేకర్స్ కు సూచించింది. బోర్డు సర్టిఫికేట్ కోసం హర్షవర్ధన్ గత ఏడాది అక్టోబరులో సెన్సార్ బోర్డుకు దరఖాస్తు పెట్టుకోగా.. బోర్డు..ఇలా మడత పేచీ పెట్టి..విడుదలను అడ్డుకుంది. దీంతో ఈ మూవీ మేకర్స్ ఈ నెల 6 న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ…సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం భావప్రకటనా స్వేచ్చను హరిస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాగలదని ఆశిస్తున్నట్టు ఈ చిత్రం మేకర్స్ తరఫు లాయర్ శిల్పి జైన్ పేర్కొన్నారు.

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?