చైనా చెప్పిన మరో ‘చేటు’.. సరికొత్త ‘బుబోనిక్ ప్లేగు’

ఇప్పటికే కరోనావైరస్  వ్యాప్తికి చైనాయే కారణమని ప్రపంచ దేశాలు గొంతెత్తి ఆరోపిస్తుండగా.. ఇప్పుడు ఆ దేశం మరో కొత్త షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ప్లేగు వ్యాధిలో కొత్త రకం రుగ్మత అయిన 'బుబోనిక్' అనే డిసీజ్ కేసు బయటపడిందని ప్రపంచానికి చాటింది. ఇందుకు తాము బాధ్యులం కాకపోయినా..

చైనా చెప్పిన మరో 'చేటు'.. సరికొత్త 'బుబోనిక్ ప్లేగు'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 2:28 PM

ఇప్పటికే కరోనావైరస్  వ్యాప్తికి చైనాయే కారణమని ప్రపంచ దేశాలు గొంతెత్తి ఆరోపిస్తుండగా.. ఇప్పుడు ఆ దేశం మరో కొత్త షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ప్లేగు వ్యాధిలో కొత్త రకం రుగ్మత అయిన ‘బుబోనిక్’ అనే డిసీజ్ కేసు బయటపడిందని ప్రపంచానికి చాటింది. ఇందుకు తాము బాధ్యులం కాకపోయినా.. ఈ ప్లేగు మూలాన్ని తెలిపింది గనుక మళ్ళీ ఆయా దేశాలు దీన్ని వేలెత్తి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగోలియాలోని ‘బయన్నర్’ అనే సిటీలో ‘ప్లేగ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ విభాగం ఈ వ్యాధి కేసుకు సంబంధించి అప్పుడే మూడో హెచ్చరిక జారీ చేసిందని చైనాలోని’ పీపుల్స్ డైలీ ఆన్ లైన్’ వెల్లడించింది. బయన్నర్ లోని ఓ ఆసుపత్రి వర్గాలు ఈ వ్యాధి తాలూకు కేసును ప్రకటించాయని, ఈ సంవత్సరాంతం వరకు ఈ వ్యాధికి సంబంధించి తామిస్తున్న వార్నింగ్ ‘చెల్లుబాటు’ అయ్యే ఉంటుందని ఈ విభాగం స్పష్టం చేసిందని ఈ ‘డైలీ’ పేర్కొంది. ఈ సిటీలో ఈ ప్లేగు విస్తరిస్తోంది. అందువల్ల ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి.. ఎవరైనా అనారోగ్యానికి గురయితే తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులకు రిపోర్టు చేయాలి అని ఆ విభాగం అధికారులు కోరారట.

మొదట పశ్చిమ మంగోలియాలోని ఖోడ్ ప్రావిన్స్ లో రెండు అనుమానిత బుబోనిక్ ప్లేగు కేసులు బయటపడ్డాయి. ల్యాబ్ టెస్టుల్లో ఇది నిర్ధారణ అయింది. 27 ఏళ్ళ ఓ వ్యక్తికి, 17 ఏళ్ళ అతని సోదరునికి ఈ వ్యాధి సోకడంతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారు. వీరిద్దరూ అడవి కుందేళ్ళ మాంసాన్ని తిన్నారని అందువల్ల ప్రజలు కూడా ఈ మాంసాన్ని తినరాదని అధికారులు హెచ్చరించారు. ఈ అన్నదమ్ములతో కాంటాక్ట్ లో ఉన్న సుమారు 146 మందిని ఐసొలేట్ చేసి వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

అసలు బుబోనిక్ ప్లేగు అంటే ? అడవి కుందేళ్ళశరీరంలో ఉండే రెక్కల్లేని పురుగుల కారణంగా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ డిసీజ్ అంటున్నారు. సకాలంలో చికిత్స లభించకుంటే 24 గంటల్లోగా సదరు రోగి మరణిస్తాడట. గత ఏడాది మంగోలియాలో అడవి కుందేళ్ళ మాంసాన్ని తిన్న ఓ జంట మృతి చెందింది. పందుల్లో ఇన్ ఫ్లుయేంజా వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి గురించి చైనా రీసర్చర్లు పరిశోధిస్తుండగా ఈ బుబోనిక్ ప్లేగు వ్యవహారం కూడా బయటపడింది.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..