చెత్త షాట్స్ ఆడితే.. వేటు తప్పదుః రవిశాస్త్రి

Ravi Shastri Warns Rishabh Pant For His Shot Selection, చెత్త షాట్స్ ఆడితే.. వేటు తప్పదుః రవిశాస్త్రి

యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో పంత్‌పై టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే అతడు మాత్రం పేలవమైన ఆటతీరుతో ఒకే తరహా షాట్ సెలక్షన్‌తో ఔట్ అవుతూ వస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో డీప్‌ స్వేర్‌ లెగ్‌లో ఔటవుతున్న తీరు అతని స్థానానికి ఎసరు తెచ్చేలా కనబడుతోంది. అంతేకాకుండా అతడి ఆటతీరుపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పంత్‌ను తప్పించి మరో టాలెంటెడ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

పంత్ తన ఆటతీరును ఒకసారి పరిశీలించుకోవాలని లేదంటే సంజూ శాంసన్ రూపంలో ఒక కఠినమైన సవాల్‌ను ఎదుర్కొంటాడని గౌతమ్ గంభీర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అటు ఈ విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించాడు. ‘పంత్ తన షాట్ సెలక్షన్ మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించాడు. ‘ఇక్కడ టాలెంట్‌ ఉందా.. లేదా అనేది ముఖ్యం కాదు. నిలకడైన ఆట తీరే ప్రధానం. అతడికి మా ప్రోత్సాహం ఉంటుంది. కానీ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లోని ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి బంతికే అతడు ఔటైన తీరు మళ్లీ రిపీట్‌ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒకవేళ అతడు ఇదే తరహా షాట్స్‌తో పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తే.. అతని స్థానంలో వేరొకరిని తీసుకోక తప్పదని పంత్‌కు ఆయన  స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *