ఇంగ్లండ్‌లో పంత్…తుది జట్టులో చోటు దక్కుతుందా?

Rishabh Pant, ఇంగ్లండ్‌లో పంత్…తుది జట్టులో చోటు దక్కుతుందా?

ఐసీసీ ప్రపంచకప్‌ 2019 టోర్నీలో భాగంగా గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శిఖర్ ధావన్ స్థానాన్ని భర్తీ చేయడానికి ముందు జాగ్రత్తగా రిషబ్ పంత్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్‌కి పంపింది. అయితే.. శిఖర్ ధావన్‌ని టోర్నీ నుంచి పక్కకి తప్పిస్తున్నట్లు అధికారికంగా బీసీసీఐ ప్రకటిస్తే..? తప్ప భారత్ తుది జట్టులో రిషబ్ పంత్‌కి అవకాశం దక్కదు. అప్పటి వరకూ రిషబ్ సహాయ సిబ్బందితో కలిసే ప్రయాణించాల్సి ఉంటుంది. కనీసం భారత్ డగౌట్‌లో కూర్చునేందుకు కూడా అవకాశం ఉండదు.

భారత్, పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ జరగనుండగా.. తాజాగా తాను మాంచెస్టర్‌లో అడుగుపెట్టినట్లు రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా అభిమానులకి తెలియజేశాడు. మ్యాచ్‌కి మరొక రోజు వ్యవధి ఉండటంతో.. తుది జట్టుపై చర్చ జరిగే సమయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకున్నా.. ఆశ్చర్యపోలేం. మరోవైపు సెమీస్ మ్యాచ్‌కి ధావన్ ఫిట్‌నెస్ సాధిస్తాడని టీమిండియా సహాయ సిబ్బంది ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *