నేనూ స్టెప్పేస్తా… రోబో గారి వయ్యారి నడక

ఫ్లోరిడాలోని హ్యూమన్ అండ్ మెషిన్ కాగ్నిషన్ సెంటర్‌లో అడుగు పెడితే చాలు.. అక్కడ ఓ స్పెషల్ రోబో దర్శనమిస్తుంది. అట్లాస్ అనే పేరున్న ఇది.. ఓ ఇరుకైన మార్గంలో నడిచినట్టే వంకరలుగా పేర్చిన సిండర్ బ్లాక్స్‌పై జాగ్రత్తగా అడుగులేస్తూ కనబడుతుంది. ఎదురుగా కనబడే వస్తులకు, తనకు మధ్య ఉన్న దూరాన్ని మెజర్ చేసేందుకు దీని రూపకర్తలు ‘లీడార్’ అనే లేజర్‌ని వినియోగించారు. బ్యాలన్స్‌డ్‌గా ఇది నడుస్తుంటే ఫ్యాషన్‌ షోలో మోడల్స్ చేసే అచ్చు క్యాట్‌వాక్‌లా కనిపించింది. ఇలాంటి […]

నేనూ స్టెప్పేస్తా... రోబో గారి వయ్యారి నడక
Follow us

|

Updated on: May 14, 2019 | 3:44 PM

ఫ్లోరిడాలోని హ్యూమన్ అండ్ మెషిన్ కాగ్నిషన్ సెంటర్‌లో అడుగు పెడితే చాలు.. అక్కడ ఓ స్పెషల్ రోబో దర్శనమిస్తుంది. అట్లాస్ అనే పేరున్న ఇది.. ఓ ఇరుకైన మార్గంలో నడిచినట్టే వంకరలుగా పేర్చిన సిండర్ బ్లాక్స్‌పై జాగ్రత్తగా అడుగులేస్తూ కనబడుతుంది. ఎదురుగా కనబడే వస్తులకు, తనకు మధ్య ఉన్న దూరాన్ని మెజర్ చేసేందుకు దీని రూపకర్తలు ‘లీడార్’ అనే లేజర్‌ని వినియోగించారు. బ్యాలన్స్‌డ్‌గా ఇది నడుస్తుంటే ఫ్యాషన్‌ షోలో మోడల్స్ చేసే అచ్చు క్యాట్‌వాక్‌లా కనిపించింది. ఇలాంటి రోబోలను సహాయక బృందాలకు, ఇరుకైన మార్గంలో చేపట్టే రిలీఫ్ మెజర్లకు వినియోగించవచ్చునని రీసెర్చర్లు అంటున్నారు. ఈ రోబోకి శిక్షణ ఇచ్చేందుకు వీరికి చాలా కాలమే పట్టిందట. లీడార్ రేజర్‌ని వాడుకుంటూ ఈ రోబో జాగ్రత్తగా నడుస్తున్న వీడియోను ఈ కేంద్రం రిలీజ్ చేసింది. ఈ నడక చూడటానికి చాలా సింపుల్ ఫీట్ గానే ఉన్నట్టు కనిపించినా.. మెషిన్లతో కూడిన రోబోతో నడిపించడం కష్టసాధ్యమైన పనే.. ఇలాంటి రోబోల మోషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు పరిశోధకులు ఇంకా కుషి చేస్తున్నారు. ఇతర గ్రహాల మీద రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుందని జెర్రీ ప్రాట్ అనే పరిశోధకులు తెలిపారు. డేంజరస్ ఎమర్జెన్సీ సినేరియోలకు బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలు ఉపకరిస్తాయని ఆయన అంటున్నారు. కొండ శిఖరాలపైన కుప్పకూలే రోబోలను మళ్ళీ నడిపించాలంటే అట్లాస్ వంటివి దోహదపడతాయని ఆయన చెప్పారు.