రేపు ఢిల్లీలో జైట్లీ అంత్యక్రియలు

Arun Jaitley Final rites, రేపు ఢిల్లీలో జైట్లీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ నాయకులు, ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 10గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్ధివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తరువాత నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో జైట్లీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు జేపీ నడ్డా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *