పేదల ఇంటికే నాణ్యమైన బియ్యం.. ప్రత్యేక డిజైన్లు సూపర్

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏపీలోని నిరుపేదల ఇళ్ళ ముందుకే నాణ్యమైన బియ్యంగా చక్కటి ప్యాకెట్లలోను.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలలో చేరబోతోంది

పేదల ఇంటికే నాణ్యమైన బియ్యం.. ప్రత్యేక డిజైన్లు సూపర్
Follow us

|

Updated on: May 08, 2020 | 8:10 PM

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏపీలోని నిరుపేదల ఇళ్ళ ముందుకే నాణ్యమైన బియ్యంగా చక్కటి ప్యాకెట్లలోను.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలలో చేరబోతోంది. ఇందుకోసం పది కిలోల ప్రత్యేక బ్యాగులను ప్రభుత్వం రెడీ చేస్తోంది. బియ్యం సరఫరా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాహనాలను కూడా ప్రభుత్వం వినియోగించబోతోంది. బ్యాగులు, వాహనాల డిజైన్లను శుక్రవారం పౌరసరఫరాల శాఖాధికారులు ఖరారు చేశారు.

ఇవే నిరుపేదలకు బియ్యాన్ని నేరుగా వారి ఇళ్ళకే సరఫరా చేసేందుకు ఉద్దేశించిన బ్యాగులు, వాహనాల డిజైన్లు. ఏపీలో రేషన్ కార్డుల మీద పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ఇక నేరుగా రేషన్ కార్డు హోల్డర్ల ఇంటికే సరఫరా చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పది కిలోల బియ్యం పట్టేలా బ్యాగులను డిజైన్ చేయించారు. బియ్యాన్ని ఇంటింటికీ తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా డిజైన్ చేయించారు. వాటిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలతో ప్రజలను ఆకట్టుకునేలా డిజైన్లు వేయించారు.

ప్రజలందరికీ దొడ్డు బియ్యం కాకుండా నాణ్యమైన సన్నబియ్యం అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఇంటింటికీ బియ్యాన్ని తరలించబోతోంది. మద్య దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి.. పేదల ఇళ్ళ వద్దకే బియ్యం చేర్చేలా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక బ్యాగులను, ప్రత్యేక వాహనాలను రెడీ చేస్తున్నారు.