బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌కు మూడు నెలల తర్వాత బెయిల్ మంజూరు..

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌కు బెయిల్ మంజూరు అయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై..

  • Ravi Kiran
  • Publish Date - 9:24 pm, Wed, 2 December 20
Showik Gets Bail

Showik Gets Bail: బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌కు బెయిల్ మంజూరు అయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టయిన అతడికి ముంబైలోని ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇక ఈ కేసులోని డ్రగ్స్ కోణంలో అరెస్టయిన రియా చక్రవర్తికి అక్టోబర్‌లో బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండాతో పాటు రియా చక్రవర్తిలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు…