అతితెలివి ఉన్న ఇన్నోసెంట్ ఫెల్లో ‘ఆర్జీవీ’

అత‌నో అర్థం కానీ డిక్ష‌న‌రీ. డెస్టినీని కూడా డైలమాలోకి నెట్టేసే మిస్టిరియస్ ప‌ర్స‌న్. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. సంధ్య‌వేళ‌లో స‌రాదాగా సినిమా అనౌన్స్ చేస్తారు. చలికాలంలో కూడా వేడి పుట్టించే థీమ్ ను మూవీ క‌థాశంగా ఎన్నుకుంటారు. వోడ్కా తాగుతూ ఆయ‌న స‌ర‌దాగా వేసే ట్వీట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాయి. దేవుడు అంటే ఓ అర్థంలేని చిరున‌వ్వు న‌వ్వుతాడు..అందాల తార‌ శ్రీదేవిని దేవ‌త క‌న్నా ఎక్కువ ఆరాధిస్తాడు. అయ‌న్ను సైలెంట్ గా అభిమానించేవారు […]

అతితెలివి ఉన్న ఇన్నోసెంట్ ఫెల్లో 'ఆర్జీవీ'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 6:50 PM

అత‌నో అర్థం కానీ డిక్ష‌న‌రీ. డెస్టినీని కూడా డైలమాలోకి నెట్టేసే మిస్టిరియస్ ప‌ర్స‌న్. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. సంధ్య‌వేళ‌లో స‌రాదాగా సినిమా అనౌన్స్ చేస్తారు. చలికాలంలో కూడా వేడి పుట్టించే థీమ్ ను మూవీ క‌థాశంగా ఎన్నుకుంటారు. వోడ్కా తాగుతూ ఆయ‌న స‌ర‌దాగా వేసే ట్వీట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాయి. దేవుడు అంటే ఓ అర్థంలేని చిరున‌వ్వు న‌వ్వుతాడు..అందాల తార‌ శ్రీదేవిని దేవ‌త క‌న్నా ఎక్కువ ఆరాధిస్తాడు. అయ‌న్ను సైలెంట్ గా అభిమానించేవారు బోలెడుమంది. స్టైయిట్ గా తిట్టేవాళ్లు కూడా అంతేమంది ఉంటారు. అమ్మో అత‌గాడి గురించి ఇంట్రో రాయాలంటేనే ఓ రోజంతా స‌రిపోతుంది. ఇప్ప‌టికే ఆయ‌నెవ‌రో మీకు అర్థ‌మ‌యిపోయి ఉంటుంది. రామ్ గోపాల్ వ‌ర్మ‌. కెరీర్ తొలినాళ్ల‌లో త‌న సినిమాల‌తో వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ ఉర‌ఫ్ ఆర్జీవీ. ఇప్పుడు సినిమా త‌ప్ప అన్ని విష‌యాల్లోనూ వార్త‌ల్లో కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.

వ‌ర్మ తొలి సినిమా ‘శివ’ తెలుగు తెర‌పై స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అన్నీ విష‌యాల్లోనూ ఈ సినిమా మూస ఫార్ములాల‌ను బ‌ద్ద‌లుకొట్టి..న‌యా జన‌రేష‌న్ ను ఉర్రూత‌లు ఊపింది. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఫార్మ‌ట్ నే ‘శివ’తో పూర్తిగా మార్చేశాడు ఆర్జీవీ. హీరో సైకిల్‌ చైన్ లాగే సీన్..సినిమా చ‌రిత్ర‌లోనే ఓ మ‌ర్చిపోలేని ఎలివేష‌న్. అంతలా… ‘శివ’ టాలీవుడ్ లో కొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అక్క‌డ్నుంచి ఆయ‌న ప్ర‌స్తానం తిరుగులేకుండా సాగింది. టాలీవుడ్, బాలీవుడ్ లోని బ‌డా స్టార్స్ అంద‌ర్ని డైరెక్ట్ చేశాడు ఆర్జీవీ. ‘లవ్’, ‘టెర్ర‌రిజం’, ‘బ్లైండ్ బిలీఫ్స్’,’ఫ్యాక్ష‌నిజం’ ‘మాఫియా’, ‘హర్రర్‌’..వాట్ నాట్..ఆర్జీవీ ట‌చ్ చేయ‌ని జాన‌ర్స్ బ‌హుశా.. ‘పౌరానికం’, ‘జాన‌ప‌దం’ మాత్ర‌మే అయి ఉంటాయి. అయితే గ‌త కొంత‌కాలంగా ఆర్జీవీ సినిమాల కంటే ముఖ్యంగా వివాదాల‌తో కాలం గ‌డిపేస్తున్నాడు.

త‌ను వేసే ప్ర‌తి స్టంట్ ప‌బ్లిసిటీ కోస‌మే అని చెప్పిన వ‌ర్మ..జ‌నాల‌కు కొన్ని సార్లు ఎంట‌ర్టైన్ మెంట్ పీస్ గా కూడా మారిపోయారు. సామాజిక‌, రాజ‌కీయ, భౌతిక అంశాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ వార్త‌ల్లో ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కొంత‌మంది ఆయ‌న్ను మ్యూజియంలో ఉండాల్సిన విలువైన వ్య‌క్తి అంటారు. మ‌రికొంద‌రు అడ‌విలో వ‌దిలేసి సొసైటీలోకి రాకుండా చుట్టూ బారీకేడ్లు పెట్టాలంటారు. అస‌లు ఏది అడ‌వో, ఏది మ్యూజియమో నిజంగా తెలిసిన వ్య‌క్తి ఆర్జీవీ మాత్ర‌మే అనేవాళ్లు కూడా లేక‌పోలేదు. ఏది ఏమైనా రామూఇజంతో స‌మాజంలోకి త‌న ఇంపాక్ట్ మాత్రం గ‌ట్టిగా తీసుకొచ్చిన ఆర్జీవీ ఈ రోజు బర్త్ డే జ‌రుపుకుంటున్నాడు. వ‌య‌సు చెప్పుకోడానికి ఇష్ట‌ప‌డ‌ని ఈ 58 ఏళ్ల టీనేజ‌ర్ ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..