Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

రాంగోపాల్ వర్మపై బయోపిక్..? నటుడు ఎవరంటే..?

RGV biopic in multiple languages, రాంగోపాల్ వర్మపై బయోపిక్..? నటుడు ఎవరంటే..?

వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. సంఘటనలను తెరకెక్కించి.. విమర్శలు కొని తెచ్చుకోవడం మనోడికి కొత్తేమీ కాదు. ఇలా.. అందరి మీద.. సినిమాలు తీసిన ఆర్జీవీపై.. సినిమా తీస్తే ఎలా ఉంటుంది..? వినడానికి ఇది కాస్త విచిత్రంగా ఉండొచ్చు కానీ.. వర్మపై కూడా సినిమా తీసేవారున్నారు. అందుకు నేనేమీ తగ్గనంటున్నారు.. జొన్న విత్తుల. ఇప్పటికే ఈ సినిమాకి టైటిల్ కూడా జొన్న విత్తుల ప్రకటించారు.

‘పప్పు వర్మ’ అనే టైటిల్ పెట్టి.. సినిమా తీసి.. దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జొన్నవిత్తుల. అయితే.. ఇప్పటికే ఆ సినిమాపై జొన్న విత్తుల పనులు ప్రారంభించేశారట. సేమ్.. వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చి మరీ.. సినిమా చేస్తున్నారని సమాచారం. అచ్చం వర్మ మేనరిజంని దింపేలా.. అతనితో జొన్న విత్తుల ప్రాక్టీసులు చేపిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.. ఈ సినిమా జొన్న విత్తులను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో.

ఇటీవలే.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీసి.. వర్మ పలు విమర్శలకు గురయ్యాడు. ఆ సమయంలోనే.. మెగాస్టార్‌పై సినిమా అంటూ.. సోషల్ మీడియా వేదికగా.. ప్రకటించగా.. దీనిపై ప్రముఖ రచయిత జొన్న విత్తుల ఫైర్ అయ్యారు. వీరిద్దరి వివాదం కొద్ది రోజులు హాట్ టాపిక్‌‌గా నడిచింది.

Related Tags