హైదరాబాద్ లోని నాంపల్లి లో తుపాకుల కలకలం!
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో రెండు తుపాకులు దొరికాయి. శుక్రవారం రాత్రి అక్కడి సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. అనుమానితుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు.