వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు..మెడికల్ బిల్లు వెయ్యి దాటితే..

రాష్ట్రంలో కోటి 42లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చా మని సీఎం జగన్ వివరణ ఇచ్చారు. 2వేలకు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. జులై 8వ తేదీ నుంచి మరో 6 జిల్లాల్లో..

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు..మెడికల్ బిల్లు వెయ్యి దాటితే..
Follow us

|

Updated on: May 29, 2020 | 5:52 PM

గత ప్రభుత్వం విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందుకే తాము ఈ రెండు రంగాలపైనే ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏడాదిగా అమలు చేసిన సంస్కరణల పై సీఎం జగన్ సమీక్షించారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆస్పత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వాస్ప త్రుల్లో అనేక మార్పులు తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ, 104.. 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై ఆయన చర్చించారు.

రాష్ట్రంలో కోటి 42లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చా మని సీఎం జగన్ వివరణ ఇచ్చారు. 2వేలకు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. వైద్యఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. క్యాన్సర్‌ రోగులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు ఉంటుందని తెలిపారు. జులై 8వ తేదీ నుంచి మరో 6 జిల్లాల్లో పథకం అమలు చేస్తామని చెప్పారు. మిగిలిన 6 జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వర్తింపజేశామన్నారు. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) రూపురేఖలను మార్చబోతున్నామని జగన్ వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి పెన్షన్లు అందిస్తున్నామని సీఎం వివరించారు.