మళ్ళీ సుప్రీం ముందుకు అయోధ్య కేసు

అయోధ్య రామమందిర వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. నవంబర్ 11న తీర్పు వెలువడినప్పట్నించి రివ్యూకు వెళ్ళే విషయంలో మల్లగుల్లాలు పడిన జమాతే ఉలేమా ఈ హింద్ సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ వేయొద్దని నిర్ణయించిన నేపథ్యంలో జమాతే నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు […]

మళ్ళీ సుప్రీం ముందుకు అయోధ్య కేసు
Follow us

|

Updated on: Dec 02, 2019 | 6:46 PM

అయోధ్య రామమందిర వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. నవంబర్ 11న తీర్పు వెలువడినప్పట్నించి రివ్యూకు వెళ్ళే విషయంలో మల్లగుల్లాలు పడిన జమాతే ఉలేమా ఈ హింద్ సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూ పిటిషన్ వేయొద్దని నిర్ణయించిన నేపథ్యంలో జమాతే నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టవచ్చన్న తీర్పు నేపథ్యంలో కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, పలు ముస్లిం సంస్థలు రివ్యూకు వెళ్ళవద్దని నిర్ణయం తీసుకున్నాయి.

దానికి తోడు పలువురు ముస్లిం మత పెద్దలు కూడా రివ్యూ ద్వారా అయోధ్య అంశాన్ని మరోసారి వివాదాస్పదం చేసి, దేశంలో అలజడులకు కారణం కావద్దని ముస్లిం సంఘాలకు సూచించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 25న సమావేశమై ఆల్ ఇండియా ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డు రివ్యూకు వ్యతిరేకంగా తీర్మానించింది. ఆరోజు 6:1 నిష్పత్తితో సున్నీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పలువురు అభినందించారు.

అయితే, దాదాపు 20 రోజుల పాటు మల్లగుల్లాలు పడిన జమాతే ఉలేమా ఈ హింద్ సంస్థ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వివాదాస్పద స్థలాన్ని దేని ఆధారంగా హిందువులకు కేటాయించారో పరిశీలించాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈ రివ్యూ పిటిషన్‌ను స్వీకరించేది లేనిది ఇంకా ఇదమిత్తంగా తేలలేదు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..