Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

రివ్యూ : ‘మీకు మాత్రమే చెప్తా’

చిత్రం : ‘మీకు మాత్రమే చెప్తా’

యాక్టర్స్: తరుణ్ భాస్కర్, అభినవ్, వాణి భోజన్ ,అనసూయ భరద్వాజ్, అవంతిక తదితరులు

సంగీతం: శివకుమార్

నిర్మాత: విజయ్ దేవరకొండ – వర్ధన్ దేవరకొండ

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్

ఇంట్రో:

పెళ్ళి చూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరోగా నిలదొక్కుకున్న విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్.. నిర్మాతగామారాడు. ‘నోటా’ సినిమాతోనే ప్రొడ్యూసర్‌గా మొదటి అడుగు వేసిన విజయ్ .. ‘మీకుమాత్రమే చెప్తా’ అని రొమాంటిక్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి ప్రొడ్యూసర్‌గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా ద్వారా ‘పెళ్లి చూపులు’  దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరోగా పరిచయమయ్యారు. మరి ఈ డైరక్టర్ టర్న్డ్ హీరో తరుణ్ భాస్కర్..హీరో రాణిస్తూనే ప్రొడ్యూసర్ మారిన విజయ్ దేవరకొండ..ఈ మూవీని ఏ రేంజ్‌కి తీసుకెళ్లారో ఈ సమీక్షలో చూద్దాం.

కథ:
రాకేశ్‌ (తరుణ్‌ భాస్కర్‌), కామేశ్‌ (అభినవ్‌ గోమటం) ఇద్దరూ బెస్ట్ ప్రెండ్స్. ఒక టీవీ చానెల్‌లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్‌, కామేశ్‌ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్‌ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెద్దవాళ్లను ఒప్పించి రాకేశ్‌ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్‌ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. అది ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో రాకేష్ టెన్షన్ పడిపోతాడు. అప్పటికే పలుమార్లు స్టెఫీ దగ్గర అబద్ధాలు చెప్పి దొరికిపోయిన రాకేష్.. ఈ వీడియో సంగతి దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు స్టెఫీని లవ్‌ చేస్తున్న ఆమె బావ జాన్సన్‌ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్‌ గడిపాడా?.. దాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఈ లోపు వీడియో ఎలా వైరల్ అయింది.. చివరికి స్టెఫీకి నిజం తెలిసిందా లేదా.. తదుపరి పర్యవసానాలేంటి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

మొదటి చిత్రం పెళ్లి చూపులు తో జాతీయ అవార్డు గెలుచుకొని టాలెంట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా మొదటి చిత్రం తో మెప్పించాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడే ఫ్రస్ట్రేటెడ్ గయ్‌గా ఆయన నటన సహజత్వానికి దగ్గరగా ఉంది. మేనరిజం, కామెడీ టైమింగ్, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో అతడు ఆకట్టుకున్నారు. ఇక తరుణ్ ఫ్రెండ్ పాత్ర చేసిన అభినవ్ హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్నాడు. అతని కామెడీ పంచెస్ కూడా ఆకట్టుకున్నాయి. అబద్దాలు నచ్చని…, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ చక్కగా సరిపోయింది. అనసూయ, అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి తక్కువ నిడివే అయినా ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్‌ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకు పెద్ద పిల్లర్‌లా నిలబడింది.

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్‌కు వచ్చే సరికి సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దీనికి తోడు అస్సలు పరిచయం లేని నటీనటులు ఎక్కువైపోవడం కూడా ఇబ్బంది పెట్టే అంశమే. ఒక చిన్న పాయింట్ ని కథావస్తువుగా తీసుకున్న ఆయన రిపీటెడ్ సన్నివేశాలతో నిరాశ కలిగించారు. అనసూయ లాంటి యాక్టర్‌ని ప్రాధాన్యం లేని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు. నిర్మాణ విలువలు  ఇంకాస్త పెంచితే స్రీన్ ఇంప్రెసీవ్‌గా ఉండేది. కేవలం కొన్ని నవ్వులు పంచుతోంది గానీ  ‘మీకు మాత్రమే చెప్తా’ పూర్తిగా ఎగ్జైట్ చేసే సినిమా కాదు.

సాంకేతిక విభాగం: 

పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్‌ చేసింది. మదన్‌గుణదేవా ఛాయాగ్రహణం బాగుంది. ప్రథమార్థంలో చక్కటి వినోదాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు షమ్మీర్‌సుల్తాన్ పనితనం కనిపించింది. అయితే ద్వితీయార్థంలో కథాగమనం పట్టుతప్పింది. తరుణ్‌భాస్కర్‌తో కలిసి షమ్మీర్ రాసిన సంభాషణలు బాగున్నాయి. మంచి వినోదాన్ని అందించాయి. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.