Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ప్రశంసించాల్సింది పోయి.. విమర్శలెందుకు బాబూ..?: అనిల్ కుమార్

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏపీకి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందనిఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలవరం పనులు వాయిదా వేస్తున్నామని ఆయన చెప్పారు. నవంబర్ నుంచి డిజైన్ ప్రకారమే పోలవరం పనులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే పనిలో జగన్ ప్రభుత్వం ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని విమర్శలు చేస్తున్నారని అనిల్ కమార్ జంకుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి శాఖలోనూ కమిషన్లు రావడం మాత్రమే చూశారు కాని.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా..? లేదా..? అనేది ఏ అధికారి పట్టించుకోలేదని అనిల్ కుమర్ విమర్శించారు. కాని జగన్ ప్రభుత్వం అలా కాదని.. దేశంలో ఎక్కడాలేని విధంగా రివర్స్ టెండరింగ్ పద్దతిని తీసుకొచ్చిందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో నష్టం జరుగుతుందని పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని, కాని అదే పనిని తక్కువ మొత్తంలోనే చేస్తామని ఆ సంస్థ ముందుకొచ్చినప్పుడు నష్టం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.