తహశీల్దార్‌‌ను తగలబెట్టేశాడు.. అసలు కారణం ఇదే..!

సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయ సజీవదహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడడానికి అసలు కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సురేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అనంతరం ఎమ్మార్వోతో మాట్లాడే […]

తహశీల్దార్‌‌ను తగలబెట్టేశాడు.. అసలు కారణం ఇదే..!
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 6:32 PM

సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయ సజీవదహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడడానికి అసలు కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సురేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అనంతరం ఎమ్మార్వోతో మాట్లాడే పనుందంటూ.. విజయారెడ్డి రూంలోకి వెళ్లాడు. అనంతరం దాదాపు అరగంట సేపు మాట్లాడుతూ.. అనంతరం ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనకు తాను పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన వారిపై కూడా పెట్రోల్ పోస్తూ.. నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో తహశీల్దార్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్‌ డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి సీపీ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ చేరుకుని సమీక్షించారు.

ఎందుకు నిప్పంటించాడు.. అసలు కారణం అదేనా..?

తహశీల్దార్ విజయను సజీవదహనం చేసిన నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు ఎమ్మార్వోను సజీవదహనం చేయాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు సురేష్‌కు సంబంధించిన ఓ ల్యాండ్ వ్యవహారమే.. ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గతకొద్ది కాలంగా పాస్‌బుక్ విషయంలో సురేష్ తహశీల్దార్ కార్యాలయానికి వస్తున్నాడని.. అయితే ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరుగుతుందంటూ భావించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం. కాగా, విజయారెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విజయారెడ్డి స్వస్థలం నకిరేకల్ నియోజకవర్గం కొండారం గ్రామం.

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

తహశీల్దార్ విజయ సజీవదహనంతో సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కార్యాలయం బయట ఆందోళనకు దిగారు. దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ రహదారిపై ధర్నా చేపట్టారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్‌ను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై సీఎంవో కార్యాలయ అధికారులు ఆరా తీశారు.

ఖండించిన మంత్రి సబితారెడ్డి

తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనను మంత్రి సబితారెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజలకు సమస్యలు ఉంటే.. పైస్థాయి అధికారుల దృష్టికి తేవాలి తప్ప ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడం దారుణమన్నారు.