రేవంత్ భూఆక్రమణలు.. కొడంగల్‌లో కూడా..

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమాలు తవ్వినకొద్ది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న గోపన్‌పల్లి భూఆక్రమణలు.. ఆ తర్వాత అనుమతి లేకుండా డ్రోన్‌లు ఎగరవేసి జైలుపాలయ్యారు. తాజాగా మళ్లీ ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి వచ్చింది. ఇదంతా ఇలా ఉంటే.. వీటన్నింటికీ తోడుగా మరో భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. రోజురోజుకు ఓ కొత్త వ్యవహారం బయటకు వస్తున్నది. ఈ సారి నగర శివారుల్లో కాకుండా.. సొంత ఊరు కొడంగల్‌లోనే. శివారులోని సర్వే నంబర్‌ 1138లో రెండున్నర […]

రేవంత్ భూఆక్రమణలు.. కొడంగల్‌లో కూడా..
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2020 | 12:40 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమాలు తవ్వినకొద్ది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న గోపన్‌పల్లి భూఆక్రమణలు.. ఆ తర్వాత అనుమతి లేకుండా డ్రోన్‌లు ఎగరవేసి జైలుపాలయ్యారు. తాజాగా మళ్లీ ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి వచ్చింది. ఇదంతా ఇలా ఉంటే.. వీటన్నింటికీ తోడుగా మరో భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. రోజురోజుకు ఓ కొత్త వ్యవహారం బయటకు వస్తున్నది. ఈ సారి నగర శివారుల్లో కాకుండా.. సొంత ఊరు కొడంగల్‌లోనే. శివారులోని సర్వే నంబర్‌ 1138లో రెండున్నర ఎకరాల భూమిలో రెండస్తుల భవనాన్ని కట్టుకున్నారు. అయితే బిల్డింగ్‌ను కట్టుకోవడం తప్పేమీ కాదు.. కానీ శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా 3,927 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టడమే నేరం. అయితే అసలు శిఖం భూములను పట్టాలు చేయడానికి వీలులేదు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ కోడంగల్‌లో జరిగిన ఆక్రమణ శిఖం భూమే. ఇక్కడే రేవంత్‌రెడ్డి ఇల్లు కట్టేసుకుని.. దాన్ని పట్టాను తన సోదరుడు తిరుపతిరెడ్డి పేరుకి బదలాయించారు.

అయితే శిఖం భూమిని ఇంటిపట్టాగా మార్చకూడదన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాత్రం అవన్నీ డోంట్ కేర్ అంటూ పట్టించుకోలేదు. అయితే శిఖం భూముల్లో ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలంటూ రేవంత్ సోదరుడు అధికారులను అడిగితే.. వారు దానికి తిరస్కరించారు. చట్ట పరంగా అన్ని రూల్స్‌ను బ్రేక్ చేసి.. ఆక్రమణదారులు బిల్డింగ్ కట్టేశారు. చట్ట వ్యతిరేకంగా సాగుతున్న ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.