రేవంత్‌పై అట్రాసిటీ కేసు.. మండలిలో ఎమ్మెల్సీ డిమాండ్

కబ్జాకు కాదేది అనర్హమన్న సామెత కొందరి రాజకీయ నాయకుల్ని చూస్తే.. వీరిని చూసే సామెతలు పుట్టుకొచ్చాయా అని డౌట్ వస్తుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న భూకబ్జాల గురించి చెప్పక్కర్లేదు. పేదల భూమా.. పెద్దల భూమా అన్నది కబ్జాకోరులకు అసలు అక్కర్లేదు. భూమిపై కన్నుపడిందా అంతే సంగతులు. ఖాలీ స్థలం కనిపిస్తే చాలు.. ఆ భూముల్లో రాబంధుల్లా వాలిపోతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి.. వారి చేతిలో కొంతముట్టజెప్పి లాగేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన […]

రేవంత్‌పై అట్రాసిటీ కేసు.. మండలిలో ఎమ్మెల్సీ  డిమాండ్
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 6:34 PM

కబ్జాకు కాదేది అనర్హమన్న సామెత కొందరి రాజకీయ నాయకుల్ని చూస్తే.. వీరిని చూసే సామెతలు పుట్టుకొచ్చాయా అని డౌట్ వస్తుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న భూకబ్జాల గురించి చెప్పక్కర్లేదు. పేదల భూమా.. పెద్దల భూమా అన్నది కబ్జాకోరులకు అసలు అక్కర్లేదు. భూమిపై కన్నుపడిందా అంతే సంగతులు. ఖాలీ స్థలం కనిపిస్తే చాలు.. ఆ భూముల్లో రాబంధుల్లా వాలిపోతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి.. వారి చేతిలో కొంతముట్టజెప్పి లాగేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి. అయితే ఇలాంటి కబ్జాదారులను ఊరుకునే ప్రసక్తేలేదంటోంది తెలంగాణ సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాకోరుల ఆగడాలను ఉపేక్షించేది లేదని.. ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది.

రంగారెడ్డి జిల్లా గంధంగూడ భూ కబ్జా బాగోతంపై గురువారం తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది.టీఆర్‌స్‌ ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావ్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి .. దళితుల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. వెంటనే అది వారికే అప్పగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. దళితుల భూమిని కబ్జా చేసిన సదరు వ్యక్తులపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఈ భూబాగోతం వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. రంగారెడ్డి జిల్లాలోని గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా చేసిన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుమని హామీ ఇచ్చారు.