ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్​లో ఆంక్షలు.. భద్రత కట్టుదిట్టం

Kashmir: Restrictions reimposed in parts of Srinagar after incidents of violence, ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్​లో ఆంక్షలు.. భద్రత కట్టుదిట్టం

ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. శనివారం ఆంక్షలు సడలించిన తర్వాత కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల కశ్మీర్ యువతకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నందు వల్ల మళ్లీ ఆంక్షలను విధించినట్లు చెప్పారు. దాదాపు 12 ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారని.. ఈ ఘటనలో పలువులు నిరసనకారులకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి విడత హజ్ యాత్ర చేపట్టిన మూడు వందల మంది యాత్రికులు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు స్వస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, అనంతరం ఆంక్షలు తిరిగి విధించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.

 

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *