నూతన దంపతులకు కరోనా నిబంధనలు..రెండేళ్ల వరకు..

కోవిడ్-19 : భూతం సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు..ఎక్కడో చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి వైరస్ మహమ్మారి విరుచుకుపడుతుందో తెలియక ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా పెళ్లైన

నూతన దంపతులకు కరోనా నిబంధనలు..రెండేళ్ల వరకు..
Follow us

|

Updated on: Jun 04, 2020 | 6:39 PM

కోవిడ్-19 : భూతం సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు..ఎక్కడో చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దేశాలవారిగా విస్తరిస్తూ..కంటికి కనిపించకుండా యావత్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. భారత్‌లోనూ కరోనా మహామ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి విరుచుకుపడుతుందో తెలియక ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా పెళ్లైన 60 జంటలు కీలక నిర్ణయం ప్రకటించాయి. రెండేళ్ల దాకా పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే..

గర్భం దాల్చింది మొదలు ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. సీమంతం, బారసాల, అన్నప్రాసన, తలనీలాలిచ్చి మొక్కులు తీర్చుకోవడం వరకు ఒక్కటేమిటీ అనేక కార్యాలు జరగాల్సి ఉంటుంది. మరి, కరోనా కష్టకాలంలో అలాంటి శుభకార్యాల్లో భౌతిక దూరం పాటించటం కష్టసాధ్యం. ఈ కాలంలో గర్భిణీలు, పుట్టే పసికందులు సురక్షితంగా ఉంటారా..? అనే సందేహాలు, భయాలు వెంటాడుతున్నాయి. అందుకే, మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా గోధేగావ్‌లో ఒకేసారి 60 కొత్త జంటలు రెండేళ్ల దాకా పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు. 2020-2021ని కరోనా కాలంగా పరిగణిస్తూ..ఈ కాలంలో గర్భం దాల్చి శిశువును ప్రమాదంలోకి నెట్టకూడదని ఆ గ్రామ పంచాయతీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే, రెండేళ్ల వరకు గర్భం దాల్చకుండా, నవజాత శిశువులకు కరోనా ప్రమాదం నుంచి తప్పించేందుకు మహిళలు సైతం ఇందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా వారి కుటుంబాల్లో మహిళలు గర్భం దాల్చనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరు తీసుకున్న నిర్ణయం తెలిసి నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.