ఆ మసీదును కూల్చటానికి కారణమిదే!

శ్రీనగర్‌లోని ఓ కాలనీ నివాసితులు 40 సంవత్సరాల పురాతన మసీదును కూల్చివేసేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. మసీదు తో సహా కొన్ని నివాస, వాణిజ్య నిర్మాణాల అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్ట్ 2002 నుండి పెండింగ్‌లో ఉంది. కమర్వారీ లోని రాంపొరా ప్రాంతంలో శ్రీనగర్ జిల్లా అభివృద్ధి కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి, మసీదు మేనేజింగ్ కమిటీ మధ్య ఒప్పందం కుదిరింది.  ఈ ఒప్పందం కుదిరిన 24 గంటల తరువాత.. శనివారం మసీదు కూల్చివేత ప్రారంభమైనట్లు అధికారులు […]

ఆ మసీదును కూల్చటానికి కారణమిదే!
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2019 | 11:26 PM

శ్రీనగర్‌లోని ఓ కాలనీ నివాసితులు 40 సంవత్సరాల పురాతన మసీదును కూల్చివేసేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. మసీదు తో సహా కొన్ని నివాస, వాణిజ్య నిర్మాణాల అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్ట్ 2002 నుండి పెండింగ్‌లో ఉంది. కమర్వారీ లోని రాంపొరా ప్రాంతంలో శ్రీనగర్ జిల్లా అభివృద్ధి కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి, మసీదు మేనేజింగ్ కమిటీ మధ్య ఒప్పందం కుదిరింది.  ఈ ఒప్పందం కుదిరిన 24 గంటల తరువాత.. శనివారం మసీదు కూల్చివేత ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. కీలకమైన ప్రాజెక్టులపై నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి డిప్యూటీ కమిషనర్ మార్గం సుగమం చేశారు.

ఈ నెల ప్రారంభంలో, జైనకోట్ వద్ద చారిత్రాత్మక దమ్దామా సాహిబ్ గురుద్వార కమిటీతో విజయవంతంగా చర్చలు జరిపారు. దీంతో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు.

కమర్వారీని నగరంలోని నూర్‌బాగ్‌తో కలుపుతూ 166 మీటర్ల రెండు లేన్ల వంతెనను పూర్తి చేయడానికి, ప్రధాన భూసేకరణ సమస్యను పరిష్కరించడానికి జిల్లా అభివృద్ధి కమిషనర్ మసీదు నిర్వహణ కమిటీతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి, మసీదు నిర్వహణ కమిటీకి మధ్య కుదిరిన ఒప్పందంలో, మసీదు పునర్నిర్మాణం 12 నెలల్లో పూర్తి చేస్తామని, అందుకు కావల్సిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని జిల్లా యంత్రాంగం స్పష్టంచేసింది.

రూ .10 కోట్ల వంతెన ప్రాజెక్టును 2002 లో ప్రారంభించామని, అయితే భూసేకరణ, అడ్డంకులను తొలగించడం వంటి సమస్యల వల్ల ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందని అధికారులు తెలిపారు. వంతెన నిర్మాణంతో పాటు, జీలం నది వెంట వరద రక్షణ, సుందరీకరణ పనులను జిల్లా యంత్రాంగం చేపడుతుందని, ప్రక్కనే ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసి ఈ ప్రాంతంలో ‘స్మార్ట్ లైటింగ్’ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!