బ్రేకింగ్: కాకినాడలో కుంగిన భవనం.. పరుగులు తీసిన ప్రజలు..

Building Collapses In Kakinada, బ్రేకింగ్: కాకినాడలో కుంగిన భవనం.. పరుగులు తీసిన ప్రజలు..

కాకినాడలో ఓ భవనం భూమిలోకి కుంగిపోయింది. భాస్కర్ అపార్ట్‌మెంట్ మూడు పిల్లర్లు ఒక్కసారిగా కుంగిపోయాయి. అయితే ఏ క్షణంలోనైనా అపార్ట్ మెంట్ కూలిపోయే అవకాశం ఉండటంతో ముందుగానే భనవం వాసులు అక్కడి నుంచి ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ అపార్ట్ మెంట్ 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లు.. భవనం వాసులు చెబుతున్నారు. ఇందులో మొత్తం 40 ఫ్లాట్లు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *