పాక్‌కు ఆర్మీ కొత్త బాస్ స్ట్రాంగ్ వార్నింగ్..

పాకిస్థాన్‌కు ఆర్మీ కొత్త చీఫ్ జనగర్ ఎంఎం నరవానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. అటు పాక్ ప్రభుత్వం కూడా దీనిని ఓ ప్రభుత్వ విధానంగా మార్చుకుందన్నారు. అంతేకాకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతోందన్నారు. ఎల్‌ఓసీ వెంట ఉగ్రవాదులు పొంచి ఉన్నారని.. దేశంలకి చొరబడటానికి వేచిచూస్తున్నారన్నారు అయితే ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా.. తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి ఉగ్రవాదుల్ని దేశంపైకి ఉగ్రవాదాన్ని […]

పాక్‌కు ఆర్మీ కొత్త బాస్ స్ట్రాంగ్ వార్నింగ్..
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2020 | 12:47 AM

పాకిస్థాన్‌కు ఆర్మీ కొత్త చీఫ్ జనగర్ ఎంఎం నరవానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. అటు పాక్ ప్రభుత్వం కూడా దీనిని ఓ ప్రభుత్వ విధానంగా మార్చుకుందన్నారు. అంతేకాకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పుడుతోందన్నారు. ఎల్‌ఓసీ వెంట ఉగ్రవాదులు పొంచి ఉన్నారని.. దేశంలకి చొరబడటానికి వేచిచూస్తున్నారన్నారు అయితే ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా.. తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి ఉగ్రవాదుల్ని దేశంపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పితే.. పాక్ నడ్డి విరిచేయడం ఖాయమన్నారు.

ఇక మహాదళపతి పదవిపై కూడా ఆయన స్పందించారు. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) వల్ల దేశంలోని త్రివిధ దళాలు మరింత బలోపేతమవుతాయన్నారు. దీంతో త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం, పారదర్శకత ఏర్పడుతుందన్నారు. కాగా, ఉగ్రవాదం అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య అని.. మన భారత దేశం ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఇది ఎంత డేంజర్‌ అన్నది.. ఇప్పుడిప్పుడే.. దాని బారిన పడిన దేశాలకు అర్థమవుతోందని.. యావత్ ప్రపంచం సమిష్టిగా ఉగ్రవాదంపై పోరాడాలని ఆర్మీ చీఫ్ అన్నారు.