గ్రేటర్‌లో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి పదవి కాలం ముగుస్తుండడంతో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

గ్రేటర్‌లో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు..?
Follow us

|

Updated on: Sep 25, 2020 | 11:16 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి పదవి కాలం ముగుస్తుండడంతో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్నికల నోడల్ ఆఫీసర్లతో పాటు రిటర్నింగ్ అధికారులు నియామకం కూడా ఇప్పటికే పూర్తైంది. అయా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గత రిజర్వేషన్లే కొనసాగుతాయా…? అనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించే విషయంలో సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఉన్నత స్థాయిలో జరిగిన సమావేశంతో పాటు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద భూముల క్రమబద్ధీకరణపై జరిగిన మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది.

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దాదాపుగా ఖరారైంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం… అందుకు అందుబాటులో ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సన్నాహక చర్యలనూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరికల్లా లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్‌ నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా బీసీ ఓటర్ల సర్వే, రిజర్వేషన్ల ఖరారు కీలకం. రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముంది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ 1955 చట్టం ప్రకారం ప్రతి ఎన్నికలకు రిజర్వేషన్లు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎన్నికలు ఐదేళ్లకోసారి జరిగినా… అంత కంటే ఎక్కువ సంవత్సరాలకు నిర్వహించినా.. కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో అమలులో ఉన్న మునిసిపల్‌ యాక్ట్‌లో ఒకసారి ఖరారైన రిజర్వేషన్లు రెండు పర్యాయాల ఎన్నికల్లో కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొంది. అదే ప్రాతిపదికన గ్రేటర్‌లోనూ రిజర్వేషన్లు కొనసాగించడంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మునిసిపల్‌ యాక్ట్‌ గ్రేటర్‌కు వర్తించని నేపథ్యంలో.. ఇక్కడ రిజర్వేషన్లు కొనసాగించాలంటే జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించాలి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దృష్ట్యా… రిజర్వేషన్లు మార్చకూడదనుకుంటే ఆర్డినెన్స్‌ జారీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. రిజర్వేషన్లు మారినా.. యథాతథంగా కొనసాగినా… స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధన అమలవుతుంది. 2016లో బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2, జనరల్‌ కేటగిరీలో 88 వార్డులు కేటాయించారు.

2016 ఎన్నికల రిజర్వేషన్లను ఒకసారి పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 100 డవిజన్లకు గానూ బీసీ మహిళ – 25 డివిజన్లలో రిజర్వేషన్ కల్పించారు. అలాగే బీసీ జనరల్‌-25, ఎస్సీ జనరల్‌ – 5, ఎస్సీ మహిళ – 5, ఎస్టీ జనరల్‌ – 1, ఎస్టీ మహిళ – 1, జనరల్‌ మహిళ – 44 డివిజన్లలో రిజర్వేషన్ కల్పించారు. మిగిలిన 44 డివిజన్లలో జనరల్ గా కేటాయించారు. కాగా, ప్రభుత్వం గనక పాత పద్ధతిని అవలంభిస్తే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
పెళ్లి చేసుకుంటే సిబిల్ స్కోర్ తగ్గిపోద్దా? దీనిలో నిజమెంత?
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!